బీహార్‌లో నితీష్‌కుమార్ సారథ్యంలో బీజేపీ-జేడీయూ కూటమి ఆదివారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెప్ట్‌పార్టీల కూటమి నుంచి బయటకు వచ్చి కమలం పార్టీతో మద్దతు మరోసారి నితీష్‌కుమార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా నితీష్ తీరుపై ఇండియా కూటమిలోని పలు పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఆయన తీరును తీవ్రంగా ఖండించాయి.
పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి అమ్ముకున్నారనే ఆరోపణలపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. పదేళ్ళుగా ఎక్కడైనా తప్పు చేశాను అనో.. ఒకరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నానో నిరూపించగలరా అని ప్రశ్నించారు. కాగా.. జగన్ మీదా ఆయన సొంత చెల్లిలే విమర్శలు చేసినప్పుడు.. తనమీద ఎందుకు చేయరని పేర్కొన్నారు. కౌన్సిలర్ భువనేశ్వరికి పదవీ ఇస్తే అమ్ముడుపోయి.. తనపైనే విమర్శిస్తున్నారని మంత్రి తెలిపారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీడీపీ-వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు సి.ఎం. రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ లో ముగియనుంది. ఈ మూడింటికి మూడు దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం పన్నుతుంటే.. అందులో ఒక్కటైనా దక్కించుకోవాలని టీడీపీ చూస్తోంది. సీటు గెలుచుకోవడానికి మ్యాజిక్ ఓట్ల సంఖ్యపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
సహజంగా రాజకీయ నాయకులు పదవుల్లోకి వచ్చారంటే కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటారు. లేదంటే బినామీల పేర్ల మీదనో.. లేదంటే బంధువుల పేర్ల మీదనో ఆస్తులు సంపాదిస్తుంటారు. ఎమ్మెల్యే అయితేనే కోట్లు వెనకేసుకుంటారు. అలాంటిది ముఖ్యమంత్రి స్థాయి అంటే ఇంకెంతగా సంపాదిస్తారో వేరే చెప్పనక్కర్లేదు. అలా అక్రమాస్తులు సంపాదించి జైలు పాలైన రాజకీయ నాయకులను ఎంతో మందిని చూశాం. తరతరాలు కూర్చుని తినేంతగా సంపాదించుకుంటారు. కానీ అందుకు భిన్నంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను సంపాదించిన ఆస్తులన్నీ పీఎం రిలీఫ్…
బిక్షగాళ్ల సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగించిందేకు కేంద్రం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. యాచకులు లేని దేశంగా ఇండియాను మార్చాలని కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్, నగర కూడళ్లు, మతపరమైన ప్రార్థనా మందిరాలు, చారిత్రిక ప్రదేశాల్లో బెగ్గర్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతుంటారు. కొందరు ఎలాంటి ఆధారం లేని దివ్యాంగులు, అనాథ పిల్లలు, వృద్ధులు యాచిస్తుంటారు. ఇంకొందరు ఆయా కారణాల చేత ఈ యాచక వృత్తిలోకి వస్తుంటారు. మరికొందరైతే ఈ వృత్తిని అడ్డంపెట్టుకుని ఈజీ మనీ కోసం…
విశాఖలో వైసీపీ 'సిద్ధం' సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. కాగా.. సభకు హాజరైన సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఫొటోలు పెట్టి కొందరు కార్యకర్తలు ఆ ఫొటోలపై బాక్సింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి కొట్టారు.
అనర్హత పిటిషన్ పై స్పీకర్ కార్యాలయంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరిగింది. కాగా.. ఈ విచారణకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. అయితే.. వాసుపల్లి గణేష్ స్పీకర్ సీతారాంను ఒక్క నిమిషం మాత్రమే కలిసి బయటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై పోటీ చేసి గెలిచాను.. తర్వాత టీడీపీ పేద వాళ్ళకు అన్యాయం చేస్తోందని గమనించి పార్టీకి దూరం జరిగానని తెలిపారు. తాను ఆ పార్టీని మోసం చేశానని టీడీపీ…
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా.. ఏపీ హైకోర్టులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లంచ్ మోషన్ పిటిషన్లపై విచారణ జరిగింది. అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలంటూ…
విజయవాడ: దుర్గగుడి పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. సోమవారం దుర్గగుడి పాలకమండలి భేటీ అయింది. ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.