ఒంగోలు తెలుగుదేశానికి ఎంతకీ కొరుకుడుపడని కొయ్యగా తయారైంది. ఆ జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సీటుతో పాటు, మరో అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా ఇంచార్జ్ దొరకడం లేదు. అభ్యర్థుల కసరత్తు, రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఆ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్.. చివరినిమిషంలో సీటు దక్కగా వచ్చే వలస నేతల కోసమే ఆ పార్టీ ఎదురుచూస్తోందని అధికార పార్టీ విమర్శిస్తోంది.
ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలే దేశానికి చివరి ఎన్నికలంటూ ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇకపై ఎన్నికలు జరగవని అన్నారు. కాబట్టి ప్రజలు వచ్చే ఎన్నికల్లో అప్రమత్తమై ఓటేయాలని కోరారు. మోడీ గనుక మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వీసాల జారీలో కొర్రీలు పెట్టే అగ్రరాజ్యం.. ఈసారి మాత్రం భారతీయులకు వీసాలు వచ్చే విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ఏకంగా రికార్డు స్థాయిలో భారతీయులకు వీసాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లంచ్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. శాసనసభ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మండలి ఛైర్మన్ జారీ చేసిన నోటీసులను ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. వీటిపై సోమవారం వాదనలు కొనసాగాయి.
ఎన్నికల ముందు కేంద్రం తాయిలాలు ప్రకటించబోతుందా? మూడోసారి ముచ్చటగా అధికారం చేపట్టేందుకు మోడీ సర్కార్ ప్రణాళికలు వేసిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రెండు నెలల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నదాతలకు, ప్రజలకు తాయిలాలు ప్రకటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్ వంటి పథకాల్లో కీలక మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రేపు(మంగళవారం) ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష చేపట్టనున్నారు. ఉదయం 11:30 కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపటి సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Ayodhya: గత వారం ఎంతో ఘనంగా అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేశ నలుమూలల నుంచి వచ్చేసిన అతిరథమహారధుల మధ్య అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పుడు లక్షలాది మంది ప్రతిరోజు అయోధ్యను సందర్శిస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో రకరకాల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పడ్డాయి. అలాగే అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా మరికొన్ని ఏర్పడ్డాయి. అయితే ఓ రెస్టారెంట్ నిర్వాహకుడి చేసిన కక్కుర్తిపని వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల తాకిడిని ఆసరాగా చేసుకుని ధనార్జనే…
ఏపీలో సైకో పాలన కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. రాజమండ్రిలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిలో ఆడపిల్లకు సమాన వాట ఇవ్వాలని ఎన్టీఆర్ పని చేస్తే, చట్టాలు చేస్తే.. ఈ రోజు వైఎస్ బిడ్డకు సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఏం జగన్ ది అని దుయ్యబట్టారు. ఆడపిల్లల పై దాడులు చేస్తున్న ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే చివరి రోజు…
సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలన్నారు. వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే విపక్షాలన్నీ ఏకధాటిపైకి రావాలనుకున్నాయి. అంతే తడువుగా ఆయా రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పాడ్డాయి. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించుకున్నాయి. సీట్లు సర్దుబాటు.. క్యాంపెయిన్, తదితర అంశాలపై బాగానే మేథోమదనం చేశాయి. ప్రజల్లో ఒక విధమైన సానుకూల పవనాలు కూడా వీచాయి. ఇంతలో కూటమి తీసుకున్న ఓ నిర్ణయం ఒక్క కుదుపు కుదిపి మూడు ముక్కలైపోయేటట్టుగా చేసింది. అంతే దీన్ని క్యాష్…
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయనికి పలువురు ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఐదవ జాబితా కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కట్టారు. సీఎంఓకు వచ్చిన వారిలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్, సుచరిత, అన్నాబత్తుని శివ కుమార్, రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామి రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలు ప్రకటించిన…