సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంఢీగఢ్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. తొలిపోరులోనే కూటమి చతికిలపడింది. కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలిసి తొలిసారి చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ కూటమికే ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు. అయినా కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అనూహ్యంగా బీజేపీకి చెందిన మనోజ్ సొంకార్ మేయర్‌గా విజయం సాధించారు.
Social Media Trolling: వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారథి పై ట్రోలింగ్..
మంగళవారం చంఢీగఢ్ మేయర్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ పోటీ చేశారు. మొత్తం కౌన్సిల్‌లో 35 ఓట్లు ఉన్నాయి. బీజేపీకి 14, ఆప్‌కు 13, కాంగ్రెస్‌కు 7, శరోమణి అకాలీదల్‌కు ఒక సభ్యుడి ఉన్నారు. దీంతో కూటమికి పూర్తి మెజార్టీ ఉంది. అయితే 8 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకుండా ప్రిసైడింగ్ అధికారి వారిని డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి మనోజ్ సాంకార్ 15 ఓట్లతో విక్టరీ సాధించారు. ఇండియా కూటమికి కేవలం 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సంఘటనతో కాంగ్రెస్, ఆప్ షాక్ అయ్యాయి. అనంతరం అక్కడనే నిరసనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని.. అధికారుల తీరుపై మండిపడ్డారు.
TS MLC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్
కేజ్రీవాల్ ఫైర్..
ఛండీగఢ్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకోవడంపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ పట్టపగలు మోసం చేసి మేయర్ సీటు తన్నుకుపోయిందని ధ్వజమెత్తారు. మేయర్ ఎన్నిక కోసమే కమలనాథులు ఇంతగా దిగజారితే.. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకెంతగా తెగిస్తుందో చెప్పక్కర్లేదని ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.