RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- రుణ ఎగవేతదారులకు ఆర్బిఐ గట్టి దెబ్బ
- స్వాధీనం చేసుకున్న వారి ఆస్తులను తిరిగి కొనుగోలు చేయలేరు
- అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రుణాలను చెల్లించకుండా ఎగ్గొట్టే డిఫాల్టర్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రుణ వసూలు ప్రక్రియలో భాగంగా బ్యాంకులు స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులను తిరిగి అదే రుణగ్రహీతకు లేదా అతనికి సంబంధించిన వ్యక్తులు, సంస్థలకు విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఎందుకు ఈ నిర్ణయం?
సాధారణంగా బ్యాంకులు రుణాలివ్వడం తమ ప్రధాన పనిగా చెప్పొచ్చు. అయితే, రుణం నిరర్థక ఆస్తి (NPA)గా మారినప్పుడు, చట్టపరమైన లేదా ఒప్పందపరమైన చర్యల ద్వారా తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఆస్తుల నిర్వహణపై స్పష్టత తీసుకురావడానికే ఆర్బీఐ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.
Also Read
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ఏడు సంవత్సరాల్లోపు విక్రయం తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆర్థికేతర ఆస్తులను తమ అంతర్గత విధానంలో పేర్కొన్న గడువులో, గరిష్ఠంగా ఏడు సంవత్సరాల్లోపు విక్రయించాలి. అలాగే వీలైనంత త్వరగా బహిరంగ వేలం (Public Auction) ద్వారా వాటిని అమ్మేందుకు ప్రయత్నించాలని ఆర్బీఐ సూచించింది.
డిఫాల్టర్లకు రెండో అవకాశం లేదు
కొత్త నిబంధనల ముసాయిదాపై అభిప్రాయాలు కోరిన సమయంలో, కొందరు రుణగ్రహీతలు తమ స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి కొనుగోలు చేసే అవకాశం కల్పించాలని సూచించారు. అయితే, దీనిని ఆర్బీఐ తిరస్కరించింది. ఇలా అనుమతిస్తే నైతిక ప్రమాదం (Moral Hazard) ఏర్పడుతుందని, రుణ క్రమశిక్షణ దెబ్బతింటుందని పేర్కొంది. రుణాలు చెల్లించని వారికి ప్రత్యేక ప్రయోజనం కల్పించడం సరైంది కాదని కేంద్ర బ్యాంక్ అభిప్రాయపడింది.
ఆస్తుల విలువ ఎలా నిర్ణయిస్తారు?
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తులను తమ ఖాతాల్లో నమోదు చేసే సమయంలో రెండు విలువల్లో తక్కువ విలువను పరిగణించాలి.
రద్దు చేసిన రుణం పుస్తక విలువ (Book Value)
ఆస్తిని వెంటనే విక్రయిస్తే లభించే అంచనా ధర
ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే, అదే విలువతో ఆస్తిని లెక్కల్లో నమోదు చేయాలి.
బ్యాంకు వినియోగిస్తే ఎలా?
స్వాధీనం చేసుకున్న ఆస్తిని బ్యాంకు స్వయంగా కార్యాలయం లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించాలని నిర్ణయిస్తే, ఆ ఆస్తిని ఆర్థికేతర ఆస్తుల జాబితా నుంచి తొలగించి ‘స్థిరాస్తులు (Fixed Assets)’ లేదా సంబంధిత అకౌంటింగ్ శీర్షిక కింద నమోదు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
కీలక అంశాలు
2026 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
డిఫాల్టర్లు లేదా వారి అనుబంధ వ్యక్తులు స్వాధీనం చేసిన ఆస్తులను తిరిగి కొనుగోలు చేయలేరు.
స్వాధీనం చేసిన ఆస్తులను గరిష్ఠంగా 7 ఏళ్లలోపు విక్రయించాలి.
బహిరంగ వేలానికి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.
రుణ క్రమశిక్షణను బలోపేతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.
- Tags
- Loan Defaulters
- properties
- RBI
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!