TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGEAPCET 2026: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGEAPCET)-2026 రెండో విడత ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. రేపటి నుండి (జూలై 17, 2026) ఈ రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసిన అనంతరం ఖాళీగా ఉన్న స్థానాలను ఈ విడత ద్వారా భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీల వివరాలు:
జూలై 17: ఆన్లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
Also Read
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
- OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
- OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
- Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
జూలై 18: స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు హెల్ప్ లైన్ కేంద్రాలలో ధృవపత్రాల పరిశీలన (Certificate Verification) జరుగుతుంది.
జూలై 18 నుండి 19 వరకు: అర్హులైన అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సుల ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
జూలై 22: విద్యార్థుల మెరిట్, వెబ్ ఆప్షన్ల ఆధారంగా రెండో విడత తాత్కాలిక సీట్ల కేటాయింపును (Allotment) ప్రకటిస్తారు.
మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం మొదటి విడతలో సీట్లు పొంది, నిర్ణీత గడువులోగా కాలేజీలలో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సంఖ్య 19,325 కాగా.. మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నేరుగా మిగిలిపోయిన ఖాళీ సీట్ల సంఖ్య 8,162. ఈ రెండు విభాగాలూ కలిపి రెండో విడత కౌన్సిలింగ్లో అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మొత్తం 27,487 సీట్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్కు సారీ.. కాంగ్రెస్కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!