గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేంద్రం వరాలు జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే ఓట్ల పండుగ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తాయిలాలు ప్రకటించే ఛాన్సుందని సమాచారం. ముఖ్యంగా వాహనదారులకు శుభవార్త ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
మాల్దీవులకు ఇండియన్స్ భారీ షాక్.. భారీగా పడిపోయిన ర్యాంక్గ.. పొరుగు అన్నాక కాస్తాంత గౌరవ.. మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. బాధ్యతగా మసులు కోవాలంటారు. అంతేకానీ కయ్యాలు పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మాల్దీవులకు దాపురించింది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు అంటే ఇదేనేమో. గతేడాది వరకు నిత్యం భారతీయ పర్యాటకులతో మాల్దీవుల పర్యాటకం కళకళలాడుతుండేది. ఇప్పుడు దేశ పెద్దలు చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది.
వైసీపీ-టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరో ఛాన్స్ ఇచ్చారు. అనర్హత పిటిషన్ల పై మరోసారి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8న స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొ్న్నారు. ఫిబ్రవరి 5లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలి అని నోటీసులో స్పష్టం చేశారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, పిటిషనర్ ప్రసాద్ రాజులకు నోటీసులు అందించారు. ఈ క్రమంలో ఒకేసారి ఐదుగురుని…
ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి విస్తారంగా పెట్టుబడులు– పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులు – ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలకు ఆమోదం తెలిపింది.
గుంటూరులో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొని, ప్రసంగించారు. కార్యకర్తల శ్రమతోనే బీజేపీ పార్టీ ఎదిగిందని తెలిపారు. రాష్ట్రానికి 22 లక్షల ఇళ్ళు కేంద్రం మంజూరు చేసిందని అన్నారు. కాగా.. బీజేపీ పార్టీ భాగస్వామ్యంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కాగా.. రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. రాజధాని విషయంలో టీడీపీ డిజైన్లతో కాలక్షేపం చేస్తే వైసీపీ మూడుముక్కల ఆట ఆడుతోందని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చింది భారతీయ జనతాపార్టీ..…
కేంద్ర బడ్జెట్ అంటేనే అందరికీ గంపెడాశలుంటాయి. పైగా త్వరలోనే దేశ వ్యాప్తంగా ఓట్ల జాతర జరగబోతుంది. దీంతో బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా వరాలు ప్రకటించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మోడీ సర్కార్ మరోసారి వచ్చేందుకు బడ్జెట్‌ను ఒక అస్త్రంగా ఉపయోగించుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్లు, కేంద్ర ఉద్యోగులైతే ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరీ నిర్మలాసీతారామన్ ఎలాంటి వరాలు కురిపిస్తారోనని అందరూ ఎదురుచూస్తు్న్నారు.
ఢిల్లీ: బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు, ఉద్యోగులు, అన్నదాతలు, రాష్ట్ర ప్రభుత్వాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ఏమైనా వరాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తు్న్నారు. ఇక బడ్జెట్ మర్మమేంటో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ కు సంబంధించి రేపటి అనుమతిని రద్దు చేశారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. రేపు గోవింద రాజస్వామి ఆలయం వద్ద షూటింగ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. కాగా.. ఈ వివాదం పెద్దది కావడంతో రేపటి సినిమా షూటింగ్ కు పోలీసులు అనుమతి రద్దు చేశారు.
గురువారమే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌పై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం దేశ ప్రజల కళ్లన్నీ నిర్మలాసీతారామన్ బడ్జెట్‌పైనే ఉన్నాయి. పైగా త్వరలోనే అతి పెద్ద ఎన్నికల జాతర జరగబోతుంది. కొద్దిరోజుల్లోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండడం.. పైగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు మోడీ సర్కార్ సన్నద్ధమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పన్ను చెల్లింపుదారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తీపికబురు ఉండొచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. అసలు…
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పై టీడీపీ నాయకుడు కంచేటి సాయిబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కంచేటి సాయికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు వైసీపీ శ్రేణులు. తమ నాయకుడు పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని కర్రలు చేత పట్టి టీడీపీ నాయకుడు సాయిబాబు ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.…