ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. త్వరలో లక్షమంది మహిళలకు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని త్వరలోనే అమలు చేస్తామన్నారు. అంతేకాకుండా.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా.. గూడాలకు రోడ్లు, నాగోబా అభివృద్ధి కోసం పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. అమర వీరుల కుటుంబాలకి రూ.5 లక్షల ఇచ్చి అండగా నిలిచాం.. కేసీఆర్ 10 ఏళ్లలో ఆదివాసిల…
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. క్రీజులో జైస్వాల్ (179), అశ్విన్ (5) ఉన్నాడు. జైస్వాల్ ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 5 సిక్స్ లు ఉన్నాయి. టెస్టుల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు సాధించాడు జైశ్వాల్. కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో షోయాబ్…
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆ రెండు హామీల అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. అలాగే.. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.
జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిట్ కాయిన్ ట్రేడింగ్లో నష్టం రావడంతో సూసైడ్ కు పాల్పడ్డాడు. మృతి చెందిన విద్యార్థి ఓయూలో పీజీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఓయూ క్యాంపస్ హాస్టల్ లో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కోరుట్లకు చెందిన నవీన్ గా గుర్తించారు. కాగా.. బిట్ కాయిన్ ట్రేడింగ్ లో రూ.3 లక్షల వరకు పోగొట్టుకున్నట్లుగా తెలుస్తుంది.
ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అందులో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం బడ్జెట్ కేటాయించింది. కాగా.. ఈ బడ్జెట్ లో కేంద్రం ఎంత ప్రకటించిందో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, ఇతర నేతలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. నాగోబాను దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. గత నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడారన్నారు. రేపు దేశంలోనూ ఇదే పరిస్థితి వస్తుంది.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎల్లుండి (శనివారం) ఏలూరులో జరిగే సిద్దం సభకు నియోజక వర్గం నుంచి కార్యకర్తలు, నేతలను పంపే పనికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో.. మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని మైలవరం పరిశీలకులు పడమట సురేష్ బాబు సమావేశమయ్యారు. కాగా.. ఎమ్మెల్యే వసంత హైదరాబాద్ లో ఉన్నారు. సిద్ధం కార్యక్రమానికి అందుబాటులో ఉండనని వసంత కృష్ణ పార్టీ పెద్దలకు ఇప్పటికే చెప్పినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ క్రమంలో..…
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పెద్దల సభలో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. సోమవారమే ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినధ్యం వహిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్దా పదవీకాలం త్వరలోనే ముగుస్తుంది. ఈ స్థానం నుంచి ప్రియాంకా గాంధీని ఎగువ సభకు పంపాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతిభాసింగ్ స్పష్టం చేశారు.
విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ చేర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేయనుంది. అందుకు రేపు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం జరుగనుంది. రేపు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) ఒప్పందం చేసుకోనుంది.