లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. విపక్షాల తీర్మానాన్ని నేను అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలు చాలాకాలం పాటు విపక్షంలోనే ఉండాలనే సంకల్పం తీసుకున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు. మరోవైపు... ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో ప్రతిపక్ష పాత్ర…
క్రైమ్ బ్రాంచ్ నోటీసు విషయంలో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తన ఇంటి ముందు 5 గంటల పాటు క్రైం బ్రాంచ్ అధికారులు డ్రామా ఆడేలా చేసింది బీజేపీ.. అతీషి ఇంటి ముందు 5 గంటల పాటు డ్రామా సాగిందని కేజ్రీవాల్ తెలిపారు. క్రైం బ్రాంచ్ అధికారులు తీసుకొచ్చిన నోటీసులో ఎలాంటి ఎఫ్‌ఐఆర్ ప్రస్తావన లేదని, ఇప్పటికీ నోటీసుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చామని తెలిపారు. అయితే ఇలాంటి డ్రామాలు దేశ ప్రగతికి దారితీయవని దుయ్యబట్టారు. ఢిల్లీ పోలీసు అధికారులు…
లక్నో జైలులో హెచ్ఐవీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. జైలులో మొదటగా 47 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా.. తాజాగా ఆ సంఖ్య 63కు చేరుకుంది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరికీ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 2023లో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ కేసులు బయటపడ్డాయి. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్ఐవీ సోకిన ఖైదీలలో చాలా మంది డ్రగ్స్ కు బానిసైన వారే ఉన్నారని పేర్కొన్నారు. జైలు లోపల కలుషితమైన సిరంజిల…
ఢిల్లీ మాజీ మంత్రి, జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు తన భార్యను కలిసేందుకు అనుమతి మంజూరు చేసింది. కస్టడీ పెరోల్ లో వారానికి ఒకసారి అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా.. అంతకుముందు తన భార్యను వారానికి రెండుసార్లు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సిసోడియా తన దరఖాస్తులో కోరారు. కాగా.. మనీష్ సిసోడియా భార్య గత 20 సంవత్సరాలుగా మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో బాధపడుతోంది.
జార్ఖండ్‌లో కాంగ్రెస్ ''భారత్ జోడో న్యాయ్ యాత్ర'' కొననసాగుతుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారు. తాజాగా ఆయన బొగ్గు రవాణా కార్మికులతో కలిసి ముచ్చటించారు. సైకిళ్లపై టన్నుల బరువును మోసుకెళ్తున్న కార్మికుల కష్టాన్ని తెలుసుకునేందుకు 200 కిలోల బొగ్గుతో ఉన్న సైకిల్‌ను నడిపారు. కాగా.. అందుకు సంబంధించిన ఫొటోలను ట్వి్ట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ.
లోక్‌సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు, కరపత్రాలతో సహా ఎటువంటి ప్రచార సామాగ్రిలో పిల్లలను ఏ రూపంలో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం సోమవారం రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో పార్టీలు కానీ.. అభ్యర్థులు కానీ ఏ విధంగానైనా పిల్లలను ఉపయోగించుకోవడం పట్ల ఎన్నికల సంఘం "జీరో టాలరెన్స్" విధానాన్ని తెలుపుతుందని పేర్కొంది.
కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి రానున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. అయితే.. ఎంపీ బాలశౌరి పార్టీలో చేరుతున్న సందర్భంలో పవన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అని కాదు.. ఎంతని కాదు.. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలంటూ తెలిపారు. పొత్తుల్లో భాగంగా జరిగే సీట్ల సర్దుబాటు వల్ల కొందరికి బాధ కలిగించవచ్చని పవన్ వ్యాఖ్యానించారు.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న బాలశౌరి జనసేనలో చేరడం శుభ సూచకం అని అన్నారు. ఒక ఎంపీగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని తపన పడ్డారని.. కేంద్ర నిధులు వచ్చేలా ఈ రాష్ట్రానికి మంచి జరిగేలా ఎంపీ బాలశౌరి వ్యవహరిస్తారని తెలిపారు. జనసేన గళం పార్లమెంట్ లో వినపడాలని…
విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా గుర్తించారు పోలీసులు. రుషికొండలోని అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్ లను 22ఏ నుంచి తప్పించేందుకు ఎమ్మార్వోతో మణికంఠ గంగారాం ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం మేరకు ఎమ్మార్వో, రియల్టర్ గంగారాం మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ఇరువురి మధ్య రుషికొండ అపార్ట్మెంట్స్ తో పాటు మరికొన్ని భూ వ్యవహారాల లావాదేవీలు జరిగాయి.
ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలశౌరిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం బాలశౌరి విజన్ తనకు నచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అనంతరం సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనని అర్జునుడుగా జగన్ పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. సొంత చెల్లి షర్మిలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా సపోర్ట్ చేస్తున్న జగన్ అర్జునుడా…