కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి రానున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. అయితే.. ఎంపీ బాలశౌరి పార్టీలో చేరుతున్న సందర్భంలో పవన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అని కాదు.. ఎంతని కాదు.. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలంటూ తెలిపారు. పొత్తుల్లో భాగంగా జరిగే సీట్ల సర్దుబాటు వల్ల కొందరికి బాధ కలిగించవచ్చని పవన్ వ్యాఖ్యానించారు.
Nadendla Manohar: రాష్ట్రానికి ఎంపీ బాలశౌరి మంచి చేస్తారు..
పొత్తు అన్న తర్వాత సీట్ల సర్దుబాటు ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని తెలిపారు. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ వంటి పార్టీలతో కూడా సీట్లు సర్దుబాటు కష్టంగానే ఉంటుందని, అయితే ఏ అడుగు వేసినా జనసేన పాదముద్ర చాలా బలంగా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే, పోటీ చేసే ప్రతి సీటు గెలిచే సీటు అవ్వాలని తాము కోరుకుంటున్నామని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ముఖ్యం కాదని అన్నారు. ఎంతని కాదు, ఎన్ని అని కాదు… గెలిచే ప్రతి సీటు జనసేన సీటు కావాలి… తక్కువలో తక్కువగా 98 శాతం స్ట్రయికింగ్ రేటు ఉండాలి అని పిలుపునిచ్చారు. దీనికి అందరి అభిమానం కావాలి, అందరి ఆశీస్సులు కావాలి అని విజ్ఞప్తి చేశారు.
Eagle: విజృంభనమ్.. విధ్వంసమ్.. గరుడమ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న రవితేజ
ఇదిలా ఉంటే.. ఈరోజు మధ్యాహ్నం సుదీర్ఘంగా చర్చించిన ఇద్దరు నేతలు.. మరోసారి సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపనున్నారు. అయితే ఒకేరోజు రెండుసార్లు భేటీ కావడం వెనక కీలక పరిణామంగా భావించవచ్చు. ఈ నేపధ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రకటన ఏమైనా ఉంటుందా.. లేదంటే తర్వాత ఏమైనా ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది.