చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ తో భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన.. ఈ అంశంపై చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో.. జనసేనకు ఎంత సీటు షేర్ ఇవ్వాలి.. ఏఏ నియోజకవర్గాలకు సంబంధించి గెలుపువకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది.
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. కాగా.. ఏపీ పదిహేనవ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు.
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు. నీ అయ్య ఎవడ్రా పడగొట్టేటోడు.. పడగొడతార్రా... ఎవడు కొట్టేది? అని దుయ్యబట్టారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం... ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం.. ప్రజల కోసం పని చేస్తోన్న ప్రభుత్వం... ఇది ప్రజా ప్రభుత్వం.. వాడు అనుకుంటున్నాడు... లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్లు ఈ ప్రభుత్వం కూలుతుందా అని నిలదీశారు. కేసీఆర్ ఖాన్‌దాన్ మొత్తం వచ్చినా…
తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తెలిపారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళేందుకు ఈరోజు మీటింగ్ లో చర్చించామన్నారు. పార్లమెంట్ నియోజక వర్గాల్లో ముఖ్య నేతల పర్యటన ఉంటుందని ఆమే పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఫిబ్రవరి 5 నుండి 8 వరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు తమకు కేటాయించిన గ్రామంలో 24 గంటలు ఉంటారు.. అక్కడ ప్రజలతో మమేకం అవుతారని డీకే అరుణ తెలిపారు. మరోవైపు.. తెలంగాణ…
హైదరాబాద్‌లో వివిధ బ్లడ్ బ్యాంకులలో డ్రగ్ కంట్రోల్ దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్.ఆర్ బ్లడ్ బ్యాంక్‌లో సోదాలు చేపట్టారు. హ్యూమన్ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్న ముఠాను గుర్తించారు. దీంతో భారీగా ప్లాస్మా యూనిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గ విస్తృత సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఓటమి గెలుపుకు నాంది అని పేర్కొన్నారు. పాలకుల్లో అప్పుడే అసహనం కనిపిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న వారికి అహంకారం ఎక్కువైందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆ రోజు నల్గొండను ముంచి పులిచింతల ప్రాజెక్ట్ కట్టారని.. ఇప్పుడు కృష్ణాను కేఆర్ఎంబీకి అప్పగించారని హరీష్ రావు మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే కేఆర్ఎంబీ పై స్పందించాలని అన్నారు.…
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆటో డ్రైవర్ల సమస్యపై తన లేఖలో ప్రస్తావించారు. ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో ఏకంగా 15 మంది ఆటోడ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటే.. పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమైపోతోందన్నారు. ఆటోలు ఎక్కేవాళ్లు లేకపోవడంతో తమ కుటుంబం గడవని పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం…
ప్రియుడితో కలిసి భర్తను హత మార్చింది భార్య. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో గత కొంతకాలంగా భర్త స్వామి, భార్య కావ్య నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే ఓ కారు డ్రైవర్ తో అక్రమసంబంధం పెట్టుకున్న కావ్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కిరాతకంగా చంపింది. పథకం ప్రకారం భర్తను ప్రియుడితో కలిసి కిడ్నాప్ చేసి నిజామబాద్ లో చంపింది భార్య. అనంతరం భర్త మృతదేహంను జవహర్ నగర్ తీసుకువచ్చి అటవీ ప్రాంతంలో కాల్చివేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తిచేసినందుకు మోడీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం.. వికసిత భారత్ సాకారం చేయడానికి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.. ఏమైంది..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని దుయ్యబట్టారు.…
ధరణి మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పోరాట యోధులు అమరుల, తాడిత పీడితుల ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇటీవల రెండు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కళాకారులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని ఇంద్రవెల్లి అమరుల స్థూపంగా ప్రమాణం చేశాం.. సభల్లో స్పష్టం చేశామన్నారు.