Rahul Gandhi: బొగ్గు రవాణా కార్మికులతో రాహుల్.. 200 కిలోల బొగ్గు ఉన్న సైకిల్ నడిపిన నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్‌లో కాంగ్రెస్ ”భారత్ జోడో న్యాయ్ యాత్ర” కొననసాగుతుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారు. తాజాగా ఆయన బొగ్గు రవాణా కార్మికులతో కలిసి ముచ్చటించారు. సైకిళ్లపై టన్నుల బరువును మోసుకెళ్తున్న కార్మికుల కష్టాన్ని తెలుసుకునేందుకు 200 కిలోల బొగ్గుతో ఉన్న సైకిల్‌ను నడిపారు. కాగా.. అందుకు సంబంధించిన ఫొటోలను ట్వి్ట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ.
Read Also: Election Commission: ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించుకోవద్దు.. రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశం
Also Read
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ప్రతిరోజూ 30-40 కిలోమీటర్లు టన్నుల బరువున్న బొగ్గు మూటలతో ప్రయాణం చేస్తారు. వారు ఎంతో కష్టపడి పనిచేస్తే.. ఈ పని నుండి వచ్చే ఆదాయం చాలా తక్కువ అని ట్వీట్ లో పేర్కొన్నారు. వారి బరువు బాధ్యతలను పంచుకోకుండా వారి సమస్యలను అవగాహన చేసుకోలేం అని రాహుల్ ఆ ట్వీట్‌లో తెలిపారు. భారతదేశాన్ని నిర్మించడంలో నిమగ్నమైన ఈ కార్మికులు తమ కష్టానికి సమానమైన వేతనాలు పొందాలి, వారికి న్యాయం జరగాలనేదే ఈ యాత్ర లక్ష్యమన్నారు.
Read Also: Rakul Preet Singh: థాయిలాండ్ లో రకుల్-జాకీ బ్యాచిలర్ పార్టీ..పిక్స్ వైరల్..
కాగా.. ఫిబ్రవరి 2న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర.. ప్రస్తుతం జార్ఖండ్‌లోని రామ్ గఢ్ లో కొనసాగుతుంది. సోమవారం తన పర్యటనలో భాగంగా 1857 జార్ఖండ్ రివల్యూషన్ లో అమరులైన షేక్ భిఖారి, తికాయిత్ ఉమ్రావ్ సింగ్ కు ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు కొత్తగా నియమితులైన చంపాయ్ సోరెన్ నుంచి రాహుల్ గాంధీకి ఘనస్వాగతం లభించింది.
साइकिल पर 200-200 किलो कोयला लेकर रोज़ 30-40 किलोमीटर चलने वाले इन युवाओं की आय नाम मात्र है।
बिना इनके साथ चले, इनके भार को महसूस किए, इनकी समस्याओं को नहीं समझा जा सकता।
इन युवा श्रमिकों की जीवनगाड़ी धीमी पड़ी, तो भारत निर्माण का पहिया भी थम जाएगा। pic.twitter.com/T1nKoC6Mdw
— Rahul Gandhi (@RahulGandhi) February 5, 2024
తాజావార్తలు
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!