త్వరలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టూర్.. టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసిన తర్వాత ఉండనుంది. అన్ని మ్యాచ్ లు హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో జరుగనున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది. బీసీసీఐతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ సిరీస్ ఖరారైనట్లు తెలుస్తుంది. జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ…
మాములుగా అయితే ఏటీఎంను చోరీ చేయడం చూశాం.. నగదు, బంగారం చోరీ చేయడం చూశాం.. కానీ వెరైటీ ఈ దొంగలు ఈవీఎం మిషన్ ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పూణేలోని రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో వెలుగు చూసింది. సోమవారం తెల్లవారుజామున పుణె జిల్లా సస్వాద్‌లోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ గదిలో ఉన్న ఈవీఎం మెషీన్‌కు చెందిన డెమో మిషన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కాగా.. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. స్ట్రాంగ్‌రూమ్ తాళం పగులగొట్టి, గదిలో ఉంచిన ఈవీఎం మెషిన్ కంట్రోల్ యూనిట్…
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. తన క్రికెట్ చరిత్రలో ఇప్పటికే తన పేరిట కొన్ని రికార్డులు ఉండగా.. మరికొన్ని బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు (118, 109) నమోదు చేశాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్గా కేన్ మామ రికార్డుల్లోకెక్కాడు.
కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎలుగుబంటును పట్టుకునేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎలుగుబంటికి ఆపరేషన్ టీం డాక్టర్ మత్తు ఇచ్చారు. దీంతో ఎలుగుబంటి సొమ్మసిల్లి పొలంలో పడిపోయింది. అనంతరం ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలించారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంప్రదాయ భారతీయ గేమ్ 'చిర్రగోనె' ఆడారు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాగా.. సింధియా చిర్రగోనె ఆడటం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా.. ఆ ఆట ఆడుతున్న వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. చాలాసార్లు క్రికెట్ ఆడానని.. కానీ, ఈ ఆట ఆడటం చాలా సరదాగా ఉందని తెలిపారు.
బియ్యం ధర తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్‌ను ప్రారంభించనట్లు ప్రకటించింది. కిలో బియ్యాన్ని రూ.29కే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి భారత్ బ్రాండ్‌తో కూడిన భారత్ రైస్ విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. భారత ఆహార సంస్థ (FCI) నుంచి సేకరించిన 5లక్షల టన్నుల బియ్యం NAFED, NCCF, కేంద్రీయ భండార్‌తో…
తనతో మాట్లాడటం మానేసిన మహిళ ఫ్లాట్‌కు నిప్పంటించాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. కాగా.. ఆ వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరుణ్ ధకేటా (32) అనే మహిళ ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బర్త్ డే పార్టీకి హాజరయ్యేందుకు వెళ్లింది. అదే సమయంలో తాళం వేసి ఉన్న ఫ్లాట్‌లోకి చొరబడ్డాడని కనాడియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కెపి యాదవ్ తెలిపారు.
మహారాష్ట్రలోని నవీ ముంబై ప్రాంతంలో రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది. కాగా.. మిస్సింగ్ అయిన బాలికల కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. తలోజా ప్రాంతంలోని లక్కీ కాంప్లెక్స్‌లో బాలికలు శనివారం అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి బాలికలను వెతికే పనిలో పోలీసులు నిమగ్నం కాగా.. మరోవైపు బాలికల తల్లిదండ్రులు తీవ్ర దు:ఖసాగరంలో మునిగిపోయారు.
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పదవీకాలంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. తొలి టర్మ్‌లో అభివృద్ధి పథంలో కాంగ్రెస్ సృష్టించిన గుంతలను పూడ్చడానికే కాలయాపన చేయాల్సి వచ్చిందన్నారు. అప్పుడు దేశాభివృద్ధికి పునాది వేశాం, రెండో టర్మ్‌లో దేశం వేగంగా ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం గోవాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. 'ఇండియా ఎనర్జీ వీక్ 2024'ను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా.. రూ. 1,350 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) క్యాంపస్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం డెవలప్‌డ్ ఇండియా, డెవలప్‌డ్ గోవా 2047 కార్యక్రమంలో మోడీ ప్రసంగించనున్నారు.