ఎవరైనా వివాహ వార్షికోత్సవాన్ని అందంగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అందరి సమక్షంలో వేడుకను జరుపుకుంటారు. కానీ ఈ జంట వినూత్న రీతిలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలోని నాగ్లా కాలీ ప్రాంతంలో రోడ్డుపై మురికి కాలువ, చెత్తాచెదారం మధ్య ఓ జంట వధూవరుల వేషధారణలో తమ 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అపరిశుభ్రత, చెత్త కుప్పల వైపు జిల్లా యంత్రాంగం దృష్టిని ఆకర్షించేందుకు దంపతులు ఇలా చేశామని తెలిపారు. దంపతులు ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నట్లు కనిపిస్తుండగా, కొంతమంది తమ చేతుల్లో ప్లకార్డులు…
అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో.. ఉదయ్ సహారన్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. కాగా.. ఈనెల 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే.. పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య సెమీస్ మ్యాచ్ జరిగితే, ఆ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది ఫైనల్ కు చేరుకుంటుంది. ఫైనల్లో ప్రత్యర్థి జట్టును పాకిస్తాన్ ను ఓడించినా.. ఆస్ట్రేలియాను ఓడించినా భారత్ రివేంజ్ తీసుకున్నట్లు అవుతుంది.
బెంగళూరులో భారత హాకీ జట్టు ఆటగాడిపై పోక్సో కింద కేసు నమోదైంది. భారత హాకీ టీమ్ డిఫెండర్ వరుణ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి గత ఐదేళ్లుగా పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. 10 రోజుల వ్యవధిలో భూకంపం రెండు సార్లు వచ్చింది. న్యాల్కల్ మండలంలో గత నెల 27న భూకంపం రాగా.. కాసేపటి క్రితం పలు చోట్ల భూమి కంపించింది. ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు. పది రోజుల వ్యవధిలో రెండుసార్లు భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
జనవరి 22న రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి రోజుకు సగటున 2 లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు. దీని కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు సహా ఇతర వ్యాపారాలు పెరిగాయి. అనేక అంతర్జాతీయ బ్రాండ్‌లు తమ ఔట్‌లెట్‌లను అయోధ్యలో తెరవాలని ప్లాన్ చేస్తున్నాయి. డొమినోస్, పిజ్జా హట్ వంటి చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ ఐటెమ్‌లకు ప్రసిద్ధి చెందిన అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం కేఎఫ్‌సీ తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది. అయితే.. కేఎఫ్‌సీ తన మెనూని మార్చుకోవలసి ఉంటుంది.…
ప్రయాణికులు చైన్ లాగా రైలును ఆపిన సంఘటనలు చాలా వినే ఉంటాం. ఏదైనా అత్యవసరమైతేనే చైన్ లాగుతారు. కానీ ఒక హంస మాత్రం ఎలాంటి సాయం లేకుండా వెళ్తున్న రైలును ఆపింది. ఇదెక్కడి ఆశ్చర్యమని అనుకుంటున్నారా.. ఇది నిజం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో HMDA మాజీ డైరెక్టర్ ఏసీబీ కస్టడీ విచారణ ఏడవరోజు ముగిసింది. 6గంటల పాటు శివ బాలకృష్ణ అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలకృష్ణతో పాటు.. ఆదిత్య అండ్ ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులను విచారించారు. అక్రమ ఆస్తులు, బినామీలపై ఏసీబీ ఆరా తీసింది. శివ బాలకృష్ణ సోదరుడు శివ సునీల్, మేనల్లుడు భరత్ పేరు మీద భారీగా ఆస్తులు గుర్తించారు. కుటుంబసభ్యులతో పాటు స్నేహితుల పేర్లపై…
కొన్ని కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి. కానీ వాటిని తిరిగి తెల్లగా చేయడం కష్టం. కానీ పసుపు దంతాలను తెల్లటి ట్యూబ్‌లైట్ లాగా మెరిసేలా చేయాలనుకుంటే కొన్ని సులభమైన నివారణలు ఉన్నాయి. దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణమయ్యే వాటిని తినడం, దంతక్షయం కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. దంతాల నుండి పసుపు పొరను తొలగించడానికి.. ఉదయం, సాయంత్రం దంతాలను బ్రష్ చేయడం మాత్రమే కాదు, కొన్ని నివారణలను ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు.
ఇంగ్లీష్లో మాట్లాడమంటే చాలా కష్టం.. దానికి మొదటి నుంచి ఇంగ్లీష్ పై పట్టు ఉండాలి.. లేదంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుకుని ఉంటే.. ఇంగ్లీష్ మాట్లాడలేము. డిగ్రీ, పీజీలు చదువుకున్న వాళ్లు కూడా ఇంగ్లీషులో మాట్లాడేందుకు అప్పుడప్పుడు తడబడుతుంటారు. కానీ.. ఒక గాజులు అమ్ముకునే మహిళ ఇంగ్లీష్ మాట్లాడటం చూస్తే.. ఆశ్చర్యపోతారు. ఈ మహిళ గోవాలో గాజులు, ముత్యాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంది. అయితే ఈ మహిళ ఇంగ్లీష్ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుండగా.. ఆమె గోవా గురించి ఇంగ్లీష్‌లో అనర్గళంగా చెబుతోంది. ఈమె…
మధ్యప్రదేశ్‌లో ఓ బాలికను ఆలయానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అనంతరం ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ అత్యాచార ఘటన 2018లో జరిగింది. మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేరం చేసే సమయానికి నిందితుడి వయస్సు 40 ఏళ్లు.