PM Modi: హ్యాట్రిక్ విజయం ఖాయం.. లోక్ సభలో ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. విపక్షాల తీర్మానాన్ని నేను అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలు చాలాకాలం పాటు విపక్షంలోనే ఉండాలనే సంకల్పం తీసుకున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు. మరోవైపు… ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
Lok sabha: సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోడీ లాస్ట్ స్పీచ్
Also Read
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని మోడీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి కోసమే ప్రతి పక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ వైఖరి వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టమని ప్రధాని తెలిపారు. ఒకే ప్రొడక్టును కాంగ్రెస్ పదే పదే రీలాంచ్ చేస్తోంది.. కాంగ్రెస్ దుకాణం ఒక్క నాయకుడి కోసమేనని విమర్శించారు. వాళ్ల దుకాణాలు త్వరలోనే మూతపడతాయని.. కాంగ్రెస్ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోందని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ నత్తనడకతో ఎవరూ పోటీ పడలేరంటూ సెటైర్లు వేశారు.
Jharkhand: రాహుల్‌తో కల్పనా సోరెన్ భేటీ.. ఏం చర్చించారంటే..!
మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ప్రధాని మోడీ తెలిపారు. ఎవ్వరేమనుకున్నా తమకు హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. బీజేపీకి సొంతంగా 370కి పైగా సీట్లు వస్తాయన్నారు. ఎన్డీయేకు వందకు పైగా సీట్లు వస్తాయని మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది.. ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానానికి చేరిందని తెలిపారు. మూడో టర్మ్ లో ప్రపంచలోనే మూడో ఆర్ధిక శక్తిగా భారత్ ఎదుగబోతుందని పేర్కొన్నారు. మూడో టర్మ్ లో వెయ్యేళ్ల అభివృద్ధికి సరిపడా పునాదులు వేస్తామని.. దేశ ప్రజలు తమ పాలనను వెయ్యేళ్లు గుర్తుంచుకుంటారని ప్రధాని మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
-
Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!