క్రైమ్ బ్రాంచ్ నోటీసు విషయంలో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తన ఇంటి ముందు 5 గంటల పాటు క్రైం బ్రాంచ్ అధికారులు డ్రామా ఆడేలా చేసింది బీజేపీ.. అతీషి ఇంటి ముందు 5 గంటల పాటు డ్రామా సాగిందని కేజ్రీవాల్ తెలిపారు. క్రైం బ్రాంచ్ అధికారులు తీసుకొచ్చిన నోటీసులో ఎలాంటి ఎఫ్‌ఐఆర్ ప్రస్తావన లేదని, ఇప్పటికీ నోటీసుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చామని తెలిపారు. అయితే ఇలాంటి డ్రామాలు దేశ ప్రగతికి దారితీయవని దుయ్యబట్టారు. ఢిల్లీ పోలీసు అధికారులు రాజకీయ నేతలు ఆడమన్నట్లుగా ఆడుతున్నారని.. ఇది వారికెంతో అవమానకరమన్నారు.
Raja The Raja : కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా “రాజా ది రాజా” మూవీ లాంఛ్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రి అతిషికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందన్న ఆరోపణలపై శనివారం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు.. నిన్న ఆప్ మంత్రి అతిషీ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.
Supreme Court: మేయర్ ఎన్నిక నిర్వహించేది ఇలానేనా? చండీగఢ్ ఆఫీసర్‌కి కోర్టు చీవాట్లు
గోవాలో ప్రభుత్వాన్ని బద్దలు కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేనలను రెండు ముక్కలు చేశారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడగొట్టారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను సంప్రదించారని కేజ్రీవాల్ అన్నారు. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.25-25 కోట్లు ఆఫర్ చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అతిషి ఆరోపించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ భావిస్తోందని అతిషి అన్నారు.