మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న బాలశౌరి జనసేనలో చేరడం శుభ సూచకం అని అన్నారు. ఒక ఎంపీగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని తపన పడ్డారని.. కేంద్ర నిధులు వచ్చేలా ఈ రాష్ట్రానికి మంచి జరిగేలా ఎంపీ బాలశౌరి వ్యవహరిస్తారని తెలిపారు. జనసేన గళం పార్లమెంట్ లో వినపడాలని పవన్ కళ్యాణ్ సూచించారని నాదెండ్ల పేర్కొన్నారు.
Read Also: Vizag: తహసీల్దార్ రమణ కేసులో కీలక ఆధారాలు లభ్యం..
తెనాలి ఎమ్మెల్యేగా ఉన్న తాను.. బాలశౌరి కలిసి అక్కడ అభివృద్ధి చేయాలని ప్రణాళికలు చేశామన్నారు. మళ్ళీ ఇప్పుడు జనసేనలో ఇద్దరం కలిసి పనిచేస్తామని నాదెండ్ల తెలిపారు. మన రాష్ట్రానికి ఎంపీ బాలశౌరి మంచి చేస్తారని చెప్పారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులు మర్చిపోం.. ఈ దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పవన్ నాయకత్వంలో భాద్యతగా పని చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు.
Read Also: Balashowry: దమ్ము ధైర్యంతో ప్రశ్నించే నాయకుడు పవన్ కల్యాణ్..