Election Commission: ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించుకోవద్దు.. రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు, కరపత్రాలతో సహా ఎటువంటి ప్రచార సామాగ్రిలో పిల్లలను ఏ రూపంలో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం సోమవారం రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో పార్టీలు కానీ.. అభ్యర్థులు కానీ ఏ విధంగానైనా పిల్లలను ఉపయోగించుకోవద్దని పేర్కొంది.
అంతేకాకుండా.. నాయకులు, అభ్యర్థులు ప్రచారంలో పిల్లలను ఎత్తుకోవడం, వాహనంలోనూ, ర్యాలీల్లోనూ పిల్లలను ఏ విధంగానూ ఉపయోగించుకోకూడదని కమిషన్ పేర్కొంది. కవిత్వం, పాటలు, మాట్లాడే పదాలు, రాజకీయ పార్టీ లేదా అభ్యర్థుల చిహ్నాల ప్రదర్శనతో సహా ఏ రూపంలోనైనా రాజకీయ ప్రచారానికి పిల్లలను ఉపయోగించద్దని ఎన్నికల కమిషన్ తెలిపింది.
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనని నాయకుడు, తన తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి దగ్గర ఉన్నట్లయితే.. అది మార్గదర్శకాల ఉల్లంఘనగా పరిగణించబడదని కమిషన్ తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌లో కీలకమైన వాటాదారులుగా రాజకీయ పార్టీల ముఖ్యమైన పాత్రను నిరంతరం నొక్కిచెప్పారు. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!