మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ.. ఈ ప్రజాస్వామ్యంలో దమ్ము ధైర్యంతో ప్రశ్నించే నాయకుడు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది.. అలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అందుకే రాష్ట్రంలో కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరికిందని చెప్పారు. బందర్ పోర్ట్ రావడానికి తన వంతు కృషి చేశానని.. బందరులో మెడికల్ కాలేజీకి నిధులు తెప్పించగలిగానన్నారు. గుడివాడ…
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు నుంచి భారీ ర్యాలీగా జనసేన కార్యాలయానికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.
నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేరం జరిగిన తీరు పట్ల మంత్రి కాకాణికి అవగాహన లేదని, ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే నెల్లూరు కోర్టులో బ్యాగు చోరీకి గురైందని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి…
మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా నా తలరాత రాసింది జగన్మోహన్ రెడ్డి.. ఆయన బంటుగా వైసీపీ విజయం కోసం త్యాగానికి సిద్ధం అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీ తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా తాను సిద్దమని తెలిపారు. జగన్ చెప్పిన స్టార్ క్యాంపెయినర్ లో అమర్నాథ్ ఒకడు అని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం అని చెప్పారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం…
భారతదేశ టెలికాం సంస్థలో టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కోసం కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించిందని భారతదేశ టెలికాం సంస్థ సెక్రటరీ నీరజ్ మిట్టల్ అన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా భారతదేశంలోని అనేక ప్రముఖ పరిశోధన విద్య సంస్థలో భారతీయ టెలికాం సంస్థలోని అబ్రిడేషన్ పైన పరిశోధనలు జరుగుతున్నాయని.. పరిశోధనలు చేసే సంస్థలకు కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చామని ఆయన తెలిపారు.
ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో సమావేశమై.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలో రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. 339 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. కాగా.. ఆట ముగిసే సమయానికి క్రీజులో క్రావ్లే (29), రెహాన్ అహ్మద్(9) పరుగులతో ఉన్నారు. ఓపెనర్ బెన్ డకెట్ వికెట్‌ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్ద కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఇంగ్లండ్ ఈ…
ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. కాగా అధికార వైసీపీ పార్టీ.. సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తుంటే.. టీడీపీ, జనసేన కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం కొత్త కాదని విమర్శించారు. సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుండి కలిసి పోటీ చేస్తాం అని చెప్తున్న వాళ్ళు.. ఇప్పటివరకు సీట్ల వ్యవహారం తేల్చుకోలేకపోయారని మంత్రి ఆరోపించారు. మేం సిద్ధం అని జగన్ అంటుంటే.. టీడీపీ, జనసేన దగ్గర నుంచి సమాధానం లేదని ఎద్దేవా చేశారు.
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈరోజు ఆటలో వన్డౌన్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగిన శుభ్మాన్ గిల్ సెంచరీ (104) చేసి జట్టుకు ఆధిక్యాన్ని పెంచాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ అయ్యర్ 29, రజత్ పాటిదర్, అక్షర్ పటేల్ 45, శ్రీకర్ భరత్ 6, అశ్విన్ 29, కుల్దీప్, బుమ్రా…