టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా తన కుమారుడితో తనకున్న రిలేషన్ షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రివాబాతో రవీంద్ర జడేజా వివాహం అయిన తర్వాత, అతని కొడుకుతో అతని సంబంధం మునుపటిలా లేదని అనిరుధ్ సింగ్ చెప్పాడు. కుటుంబంలో చీలిక రావడానికి రివాబా కారణమని అనిరుధ్ సింగ్ ఆరోపించారు. ఒకే నగరంలో నివసిస్తున్నప్పటికీ, తన కొడుకును కలవలేకపోతున్నాడని చెప్పాడు. రవీంద్ర జడేజా క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేదని అనిరుధ్ సింగ్ అన్నాడు. వాళ్ళకి పెళ్ళి…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్ధిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎం తెలిపారు. ఆలస్యమైనా వారికి ఈ గౌరవం దక్కడం గర్వకారణం ఉందని పేర్కొన్నారు. నా తరపున, సభ తరపున, తెలంగాణ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. పీవీ నరసింహా…
HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించాడు. బాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగ్లకు ఐఏఎస్ అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా పలు దఫాలుగా నగదు రూపంలో చెల్లింపులు జరిపినట్లు వెల్లడించారు. నార్సింగిలోని ఒక కంపెనీ వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ క్లియరెన్స్ చేశాడు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత రత్న అవార్డు ఇవ్వడం పట్ల పీవీ స్వగ్రామం వంగర గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. పీవీకి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. భారత దేశానికి ఆర్థిక సంస్కరణలు తెచ్చి అభివృద్ధికి తోడ్పడిన పీవీని గౌరవించడం సంతోషకరం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా.. పీవీ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా.. బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వంగర గ్రామస్థులు కోరుతున్నారు.
ఏపీలో దాదాపు రూ. 600 కోట్ల వ్యయంతో 4 వేల పై చిలుకు ఆలయాలు నిర్మించామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దుర్గ ఆలయం, శ్రీశైలం దేవస్థానంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. శ్రీశైలంలో వసతి కొరత ఉందని.. కొత్తగా 750 గదుల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. 3 స్టార్ వసతులతో బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే విధానంలో వసతి నిర్మాణం చేపడుతున్నామన్నారు. అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల తదితర దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
చంద్రబాబుపై ఎంపీ నందిగామ సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అన్నారు. అనరాని మాటలు అని ఇప్పుడు బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లడుతున్నారని ఆరోపించారు. తాను పనిచేస్తేనే ఓటు వేయాలని జగన్ చెప్తుంటే.. 40 ఏళ్ల అనుభవం ఉండి పొత్తుల కోసం చంద్రబాబు బీజేపీ వెంట పడుతున్నారని విమర్శించారు. 14 ఏళ్లలో ప్రజలకు చేసిన మంచి పని చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసులో చార్జిషీట్ ను ఇవాళ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసింది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను పేర్కొంది. కాగా.. నారా లోకేష్ , లింగమనేని రమేష్, రాజశేఖర్ ప్రధాన నిందితులుగా సీఐడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అనుచితంగా లబ్ధి పొందాలని…
చంద్రబాబు, పవన్ పై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీ పార్టీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరలా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. చంద్రబాబు, సోనియాగాంధీ అమిత్ షా.. వంటి వారిని ఎన్నిసార్లు కలిసిన జగన్మోహన్ రెడ్డిని తాకలేరని అన్నారు. గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రోజా తెలిపారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అమిత్ షాను కలిశారు.. సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రధానిని కలుస్తున్నారని అన్నారు. పొత్తుల గురించి వెంపర్లాడటం చూస్తే టీడీపీ ఎంత బలహీనంగా ఉందనేది బయటపడుతోందని విమర్శించారు. టీడీపీకి బలముంటే పొత్తుల కోసం ఎవరి వెంట పడాల్సిన అవసరం ఉండదని ఆరోపించారు.
విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 206 అడుగుల అంబేద్కర్ మహా శిల్పాన్ని ఏర్పాటు చేయడం ఓ చరిత్ర అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. సమసమాజ స్థాపనకు సీఎం జగన్ నడుంబిగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దేశంలో బలహీన వర్గాలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ కాదని నిరూపించే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. నిరూపించే సత్తా ఉంటే రండి బహిరంగంగా…