చంద్రబాబుపై ఎంపీ నందిగామ సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అన్నారు. అనరాని మాటలు అని ఇప్పుడు బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లడుతున్నారని ఆరోపించారు. తాను పనిచేస్తేనే ఓటు వేయాలని జగన్ చెప్తుంటే.. 40 ఏళ్ల అనుభవం ఉండి పొత్తుల కోసం చంద్రబాబు బీజేపీ వెంట పడుతున్నారని విమర్శించారు. 14 ఏళ్లలో ప్రజలకు చేసిన మంచి పని చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు.
Viral Video: బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు.. విండో కోసం గొడవ..
చంద్రబాబు సర్వేల్లో కూడా వైసీపీ గెలుస్తుంది అని తెలిసి బీజేపీ వెంట పడుతున్నారని ఎంపీ విమర్శించారు. బడుగు బలహీన వర్గాలను కలుపుకుని సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఏపీ ప్రభుత్వ అప్పులకు లెక్కలు చెప్పె సామర్ధ్యం వైసీపీకి ఉందని తెలిపారు. సొంతగా పోటీ చేయలేదు కాబట్టి చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి హోదా చంద్రబాబుకి తెలీదని విమర్శించారు. చంద్రబాబు ఏనాడు ప్రజలను నమ్ముకోలేదు.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి ఓటమి తప్పదని పేర్కొన్నారు. చంద్రబాబు ఏదైనా చేయగలడు.. లేని రాజధానిని సృష్టించగలడని దుయ్యబట్టారు.
Minister Roja: ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా జగన్ను ఏమి చేయలేవు..
ఇండియా టుడే సర్వేలో టీడీపీకి 17 లోక్ సభ స్థానాలు వస్తే.. మరి పవన్, బీజేపీ పొత్తు ఎందుకు అని ఎంపీ సురేష్ విమర్శలు గుప్పించారు. తాము ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కొంటాం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని తెలిపారు. పొత్తుల కోసం అయితే ఎప్పుడో బీజేపీతో పొత్తు పెట్టుకునే వాళ్ళం అని పేర్కొన్నారు. మరోవైపు.. యాత్ర -2 లో తన పాత్ర రావడం సంతోషంగా ఉందని అన్నారు. తనకు జగన్ ముఖ్యమని పదవులు కాదని అన్నారు.