చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అమిత్ షాను కలిశారు.. సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రధానిని కలుస్తున్నారని అన్నారు. పొత్తుల గురించి వెంపర్లాడటం చూస్తే టీడీపీ ఎంత బలహీనంగా ఉందనేది బయటపడుతోందని విమర్శించారు. టీడీపీకి బలముంటే పొత్తుల కోసం ఎవరి వెంట పడాల్సిన అవసరం ఉండదని ఆరోపించారు.
Ravela Kishore Babu: అంబేద్కర్ మహా శిల్పాన్ని ఏర్పాటు చేయడం ఓ చరిత్ర..
ఇండియాటుడే సర్వేను సీ ఓటర్ సంస్థతో కలసి చేస్తోందని సజ్జల తెలిపారు. గతంలో చేసిన సర్వేల్లోనూ టీడీపీకి ఎక్కువ సీట్లు ఇచ్చారని.. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వారి సర్వే విశ్వసనీయత ఏమిటనేది తెలుస్తుందని అన్నారు. బీజేపీ నేతలను తిట్టిన చంద్రబాబు తిరిగి ఆ పార్టీ నేతలను కలవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబును బీజేపీ నేతలే పిలిచారని ప్రచారం చేసుకుంటున్నారని.. చంద్రబాబు తప్ప మరో అవకాశం లేదన్నట్లు బీజేపీ నేతలు అనుకుంటున్నారని సజ్జల తెలిపారు. బీజేపీ తన స్థాయిని దిగజార్చుకుంటోందని పేర్కొన్నారు.
Naga Babu: బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి ఏర్పడటం ఖాయం..
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపైనే ప్రధానితో సీఎం జగన్ చర్చిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మరోవైపు.. రాజ్యసభ ఎంపీ పదవికి టీడీపీ అభ్యర్థిని నిలిపినా గెలిపించే బలం టీడీపీకి లేదని విమర్శించారు. నాలుగైదు ఎమ్మెల్యేల బలం తేడా ఉండి ప్రయత్నిస్తే కక్కురితి పెడుతున్నారు అనుకోవచ్చని దుయ్యబట్టారు. 25 ఎమ్మెల్యేల బలం కంటే ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు ఏ రకంగా అభ్యర్థిని పెడతారు? అని ప్రశ్నించారు. రాజ్యసభ రేసులో అభ్యర్థిని నిలపాలని టీడీపీ ఆలోచన చేయడమే అనైతికం అని పేర్కొన్నారు.