Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor Horror: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ తల్లి తన ఏడేళ్ల కుమారుడిపై ప్రియుడితో కలిసి అమానుషంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలతో పాటు ప్రైవేట్ భాగంలో కూడా బ్లేడ్‌తో గాయపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, వీకోట ఈశ్వర్‌నగర్‌కు చెందిన ఓ మహిళ భర్త కొంతకాలం క్రితం మరణించాడు. అనంతరం ఎర్రచేనుకు చెందిన రాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ సంబంధానికి తన కుమారుడు విశాల్ అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె.. ప్రియుడు రాజుతో కలిసి బాలుడిని తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
బాలుడిని విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, బ్లేడ్‌తో శరీరంపై గాయాలు చేశారు.. చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించగా, బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.. బాలుడి శరీరంపై మొత్తం గాయాలు ఉండగా.. ప్రైవేట్ భాగాలను కూడా బ్లేడ్‌తో గాయపర్చడం కలకలం రేపుతోంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. బాలుడిపై జరిగిన దాడికి గల కారణాలు, ఆరోపణల నిజానిజాలపై విచారణ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?