తెలంగాణ బడ్జెట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్ పాలన అంకెల గారడీ, మాటల గారడీ కూడా అని ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప.. మీరిచ్చిన ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదని అన్నారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించారు. మరి రైతుబంధు (భరోసా), రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. ఇలా అనేక వ్యవసాయరంగ కార్యక్రమాలకు…
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రసంగంలో పాత ఒరవడినే ఉందని ఆరోపించారు. వాస్తవ పరిస్థితికి బడ్జెట్ ప్రతిపాదనలకు పొంతన లేదని విమర్శించారు. రూ.5 లక్షల కోట్లు పెడితే కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు కావని ఈటల రాజేందర్ తెలిపారు.
సికింద్రాబాద్లో జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ విజయోత్సవ సభకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి. పద్మరావు గౌడ్, మాగంటి గోపీనాథ్, పాడిడి కౌశిక్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడారు. బడ్జెట్ మొత్తం నిరాశగా ఉందని విమర్శించారు. 6 పథకాల అమలుకు లక్షా 25 వేల కోట్లు అవసరమవుతుందని.. బడ్జెట్ లో…
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలకు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ తల్లిదండ్రుల కలలను చెరిపేస్తున్నారు. ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని అనవసరంగా ప్రాణాలను వదిలేసుకుంటున్నారు. తాజాగా.. ఓ విద్యార్థి ఐఐటీ ఫలితాల్లో మార్కులు వచ్చాయని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా TSRTC 100 బస్సులను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన బస్సులను మేడారంకు కూడా నడపనున్నుట్లు ఆయన చెప్పారు. మరోవైపు.. పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరో 1000 బస్సులు కొంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టాలని మేనిఫెస్టోలో పెట్టాం.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే…
హైదరాబాద్ ఎన్టీఆర్మార్గ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద TSRTC కొత్త బస్సులు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 100 కొత్త బస్సులు ప్రారంభించటం సంతోషకరం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలు నెరవేరుస్తుందని అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు…
తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదలైంది. కాసేపటి క్రితమే తెలంగాణ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి కొన్ని షెడ్యూల్ ను విడుదల చేయగా.. తాజాగా ఐసెట్ షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. తాజాగా.. తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. మే 23వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులు.. ఆరోగ్య శ్రీకి ప్రత్యేక కార్డు ఇస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు.. వ్యవసాయం చేసే భూములకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. నేషనల్ హైవేలు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వమని పేర్కొ్న్నారు. పెట్టుబడి సాయం అందాల్సింది రైతులకు అని తెలిపారు. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని విషయాల పై చర్చ చేసి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి…
తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల లిస్ట్ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. గతేడాది జూలైలో గ్రూప్-4 పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. 8,810 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. 7 లక్షల 26 వేల 837 మంది అభ్యర్థుల ర్యాంకింగ్ లను ప్రకటించింది. అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో ర్యాంకులు చూసుకోవాలని సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సెలక్ట్ అయిన వారి షార్ట్ లిస్ట్ ను తరవాత ప్రకటిస్తామని తెలిపింది. ఈ పరీక్షకు…