ఎస్ఎల్‌బీసీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. పదేళ్లలో కిలోమీటర్ తవ్వారని ఇటీవల ప్రెస్‌మీట్‌లో రేవంత్ చెప్పారని.. కానీ తమ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వామని తెలిపారు. తాము విమర్శలు చేయాలంటే చాలా చేస్తాం.. కానీ మైక్ కట్ అవుతుందని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజు ఏపీ పోలీసులు అన్యాయంగా వచ్చారన్నారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్‌లో, నాగార్జున సాగర్ తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంటుందని... కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్‌ను ఏపీ…
పద్మవిభూషణ్ చిరంజీవిని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అభినందించారు. గవర్నర్ ఆహ్వానంతో ఈరోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి, సురేఖ రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవికి శాలువా కప్పిన గవర్నర్ తమిళిసై... ఆయన పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై.. చిరంజీవి సామాజిక సేవలని ప్రస్తావిస్తూ, పద్మవిభూషణ్ పురస్కారం పొందినందుకు అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
గత ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డుకు తాము ప్రాజెక్టులు అప్పగించలేదని తెలిపారు. ఎక్కడి నుండో మినిట్స్ తెచ్చి సమాధానం చెప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లో హనీ ట్రాప్ చేసి రాము సింగోటం అనే వ్యక్తిని ఓ ముఠా హత్య చేసింది. మహిళ ద్వారా ట్రాప్ చేయించి రాము సింగోటంని జూబ్లీహిల్స్ పిలిపించి.. జూబ్లీహిల్స్ కి వచ్చిన గోల్డ్ మాన్ రాము సింగోటంపై ముకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. మహిళతో పాటు ఆమె కూతుర్ని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు రాము సింగోటం. ఈ క్రమంలో.. రౌడీ షీటర్లకు చెప్పి రాము సింగోటంని హత్య…
తెలంగాణ ప్రభుత్వం రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరాడాలంటే ప్రధాని మోదీతో కొట్లాడాలన్నారు. రండి కలిసి కొట్లాడదం.. ప్రాజెక్టులు గుంజుకుంటే కలిసి కొట్లాడదమన్నారు. సన్ స్ట్రోక్ ఈ రాష్ట్రానికి తగలొద్దు అనుకుంటున్నా.. ఒక్కడి కోసం ఇంత మందిని బలి పెడుతున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కలవవచ్చు.. రండి కలిసి పునర్నూర్మిద్దామని సీఎం తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు తమ కుటుంబం నుండి మూడు పదవులు ఉండాలి అనుకున్నామని మల్లారెడ్డి తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చెయ్యడానికి సిద్ధం ఉన్నాడని చెప్పారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం పట్ల అభినందిస్తూ తెలంగాణ శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డ, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానికి కేంద్రం భారతరత్న ప్రకటించడంతో ఈరోజు తెలంగాణ గుండె ఉప్పొంగింది అని అన్నారు.
తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే తమపై శాపనార్థాలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని.. రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఆరోపించారు. అయినప్పటికీ తాము ఉద్యోగులకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నామన్నారు. మరోవైపు.. రైతుబంధుపై పదే పదే మాట్లాడుతున్నారని.. గతంలో వారు ఎలా వేసారో గుర్తు చేసుకోవాలన్నారు. 2018-19లో యాసంగి పంటకు రైతుబంధు ఐదు నెలలకు వేశారు.. 2019-20లో 9 నెలలు, 2021-22 నాలుగు నెలలు పట్టిందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళలో కూడా అణచివేతలు.. ఆధిపత్య ధోరణి కొనసాగిందని ఆరోపించారు. అందుకే మార్పు కావాలని ప్రజలు చూశారని తెలిపారు. దురదృష్టవశాత్తు కేసీఆర్ ఇవాళ సభకు రాలేదు.. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్.. ఆయన మేధావితనంతో సలహాలు సూచనలు ఇస్తే బాగుండేది అరి అన్నారు. వారి సూచనలు తీసుకుని గౌరవిస్తాం.. కానీ…