ఏపీలో దాదాపు రూ. 600 కోట్ల వ్యయంతో 4 వేల పై చిలుకు ఆలయాలు నిర్మించామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దుర్గ ఆలయం, శ్రీశైలం దేవస్థానంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. శ్రీశైలంలో వసతి కొరత ఉందని.. కొత్తగా 750 గదుల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. 3 స్టార్ వసతులతో బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే విధానంలో వసతి నిర్మాణం చేపడుతున్నామన్నారు. అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల తదితర దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
Mumbai: ముంబైలో కాల్పుల కలకలం.. శివసేన నేత కుమారుడిపై ఫైరింగ్
మొత్తంగా రూ. 1600 కోట్లతో ఆలయాల అభివృద్ధి ప్రాజెక్టుకు అమలు చేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో ప్రభుత్వం చేసిన యాగానికి రాష్ట్రానికి నిధులు వచ్చాయన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 10 వేల ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు సౌకర్యంగా ఉండేలా అన్ని ఆలయాల్లో టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నామని తెలిపారు.
Mood of the Nation survey: 2024లో బీజేపీకే అధికారం.. 335 స్థానాలతో మోడీకి పట్టం..
అంతేకాకుండా.. ఆభరణాలు, ఆస్తుల వివరాలు నమోదు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ ఆలయంలోనూ మాస్టర్ ప్లాన్ ప్రకారమే అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రసాద్ స్కీమ్ కోసం అన్నవరం దేవాలయానికి రూ.50 కోట్ల నిధులు కోరామన్నారు. మరోవైపు.. దేవాలయ భూములను అన్యాక్రాంతం కాకుండా చూస్తున్నామని.. చట్టాలలో మార్పులు చేశామన్నారు. కాగా.. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గ గుడిలో శివాలయం 14 తేదీన పునః ప్రతిష్ట జరుగుతుందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.