మంత్రి ఆర్కే రోజా తిరుపతి నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి రోడ్డు మార్గాన నోవాటెల్ హోటల్ కి వెళ్లారు. రేపు విశాఖ రైల్వే స్టేడియంలో జరగబోయే ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో పాల్గొననున్నారు మంత్రి రోజా. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలుగుదేశం గానీ, జనసేన గానీ తోకపార్టీలన్నీ కలిసి వచ్చిన తమకేం ఇబ్బంది లేదన్నారు.
Sajjala Ramakrishna Reddy: పొత్తుల కోసం చంద్రబాబు ఎక్కడికైనా వెళ్తారు..
చంద్రబాబు, పవన్ పై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీ పార్టీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరలా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. చంద్రబాబు, సోనియాగాంధీ అమిత్ షా.. వంటి వారిని ఎన్నిసార్లు కలిసిన జగన్మోహన్ రెడ్డిని తాకలేరని అన్నారు. గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రోజా తెలిపారు.
ఇదిలా ఉంటే.. రేపటి నుంచి విశాఖ వేదికగా ‘ఆడుదాం ఆంధ్రా’ ఫైనల్స్ జరుగనున్నాయి. ఈ పోటీల్లో 5 కేటగిరీల్లో 3వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. రేపు విశాఖ రైల్వే గ్రౌండ్ లో ప్రారంభ వేడుకలను క్రీడల శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు.