రాష్ట్ర పరిస్థితులపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి వస్తే పవన్ కల్యాణ్ సిద్ధం అని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పరిపాలన ఎంత గొప్పగా ఉందో వాళ్ళు చెబుతారు.. ఎంత చెత్తగా ఉందో మేం చూపిస్తామని చెప్పారు. కాగా.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడటం 98శాతం ఖాయమని అన్నారు. 2014లో వచ్చిన ఫలితాల కంటే 30శాతం అధికంగా సీట్లు సాధిస్తాం అని ధీమావ్యక్తం చేశారు.
అనర్హత నోటీసుపై స్పీకరు తమ్మినేని సీతారాంను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిశారు. స్పీకర్ తో పర్సనల్ హియరింగ్ కు హాజరుకావడం రెండోసారి అని అన్నారు. మొదటి సారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారనీ.. అవన్నీ తాను చెప్పినట్లు ఆనం తెలిపారు. దానికి సంబంధించిన పేపర్స్ ను కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనర్హత నోటీసుపై స్పీకర్ కు 5వ తేదీన తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఇచ్చామని అన్నారు. మీడియాలో ప్రచురించిన వాటిని చీఫ్ విప్ ప్రసాదరాజు ఆధరైజ్ చేసి ఇచ్చారని…
ఏపీ రాజకీయం ఢిల్లీకి మారింది. బీజేపీ పెద్దలతో రాష్ట్ర అధినేతల వరుస భేటీలు ఆసక్తిరేపుతున్నాయి. నిన్న కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై చర్చించారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నమే ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. కాగా.. చంద్రబాబు వెళ్లిన మరుసటి రోజే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. కాగా.. నిన్న బీజేపీ పెద్దలతో జరిగిన చంద్రబాబు భేటీలో జనసేన, బీజేపీతో పొత్తు ఖరారైందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పొత్తుల విషయంలో జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్యలు సానుకూలంగా జరిగినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 5 నుంచి 6 లోక్ సభ స్థానాలు, 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్లు సమాచారం. విజయవాడ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి, రాజంపేట, విశాఖ లోక్ సభ స్థానాలు బీజేపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
2022-2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఆర్ధిక గణాంకాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. రాబడులు- వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నివేదిక ఇచ్చింది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా.. మూడురోజుల పాటు జరిగిన సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. దీంతో ఈరోజు సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కాగా.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భావోద్వేగానికి లోనయ్యారు. శాసనసభ స్పీకర్గా శ్రీకాకుళం నుండి నాల్గవ వ్యక్తిగా పని చేసే అదృష్టం దక్కిందని తెలిపారు. సమావేశాల్లో ప్రతిసారి నిష్పక్షపాతంగా వ్యవహరించానని అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించానని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చాను.. సభలో జవాబుదారీగా…
ఈనెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పట్నం వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ఆడుదాం ఆంధ్రా' ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ముగింపు వేడుకలు విశాఖలోని ACA స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించనున్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా.. ఈనెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు జరిగాయి. 10 గంటల 2 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి.
తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో.. 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగం పై చర్చ జరగనుంది. బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరుఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొ్న్నారు. అటు బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, హరీష్ రావు.. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ,…
పండు ఒక సహజమైన చిరుతిండి. దీని వినియోగం మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే మూలకాలు మన ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వాటి వినియోగం శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో నారింజ పండు మంచిగా పనిచేస్తుంది. దీనిలో ఉండే.. విటమిన్ సి, ఈ సిట్రస్.. చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా బరువును తగ్గించడంలో కూడా…