టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా తన కుమారుడితో తనకున్న రిలేషన్ షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రివాబాతో రవీంద్ర జడేజా వివాహం అయిన తర్వాత, అతని కొడుకుతో అతని సంబంధం మునుపటిలా లేదని అనిరుధ్ సింగ్ చెప్పాడు. కుటుంబంలో చీలిక రావడానికి రివాబా కారణమని అనిరుధ్ సింగ్ ఆరోపించారు. ఒకే నగరంలో నివసిస్తున్నప్పటికీ, తన కొడుకును కలవలేకపోతున్నాడని చెప్పాడు. రవీంద్ర జడేజా క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేదని అనిరుధ్ సింగ్ అన్నాడు. వాళ్ళకి పెళ్ళి అయి ఉండేది కాదు.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నాడు. 2016లో రివాబాను రవీంద్ర జడేజా వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండు, మూడు నెలల తరువాత నుంచి తన కొడుకుతో సంబంధాలు తెగిపోయాయని.. తమ కుటుంబంలో చీలికలు రావడానికి రివాబా కారణం అని అనిరుధ్ సింగ్ ఆరోపించారు.
వాళ్లని మేము పిలవము, అలాగే వారు మాకు ఫోన్ కూడా చేయరని అనిరుధ్ సింగ్ తెలిపాడు. జామ్‌నగర్‌లోనే జడేజా తన స్వంత బంగ్లాలో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య ఏం చేసిందో తనకు తెలియదని చెప్పాడు. అతడి మనసుని మార్చేసి ఉంటుందని అన్నాడు. ఇన్నాళ్లుగా మనవరాలి మొహం కూడా చూడడం లేదని పేర్కొంటూ.. ‘‘నేనేమీ దాచిపెట్టను. ఐదేళ్లుగా మా మనవరాలి ముఖం కూడా చూడలేదు. రవీంద్ర అత్తమామలు అన్నీ నిర్వహిస్తారు. వారు ప్రతిదానిలో జోక్యం చేసుకుంటారని అనిరుధ్ సింగ్ తెలిపాడు.
మరోవైపు ఈ ఆరోపణలపై రవీంద్ర జడేజా స్పందించాడు. ఎమ్మెల్యే అయిన తన భార్య ప్రతిష్టను దెబ్బతీయాలనే తన తండ్రి అసత్య ఆరోపణలు చేశాడని అన్నాడు. ‘అదొక చెత్త ఇంటర్వ్యూ. అతడు చేసిన ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా తండ్రి మాటల్ని నేను ఖండిస్తున్నా. ఇదంతా నా భార్య గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగం’ అని శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ దివ్య భాస్కర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జడేజా, రివాబాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా.. ఆ వీడియో క్షణాల్లో మీడియాలో వైరల్ అయింది.
Let's ignore what's said in scripted interviews 🙏 pic.twitter.com/y3LtW7ZbiC
— Ravindrasinh jadeja (@imjadeja) February 9, 2024