అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసులో చార్జిషీట్ ను ఇవాళ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసింది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను పేర్కొంది. కాగా.. నారా లోకేష్ , లింగమనేని రమేష్, రాజశేఖర్ ప్రధాన నిందితులుగా సీఐడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అనుచితంగా లబ్ధి పొందాలని చూశారని ఛార్జ్ షీట్ లో పేర్కొంది. చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లో ఇదంతా జరిగిందని సిఐడి ఛార్జ్ షీట్ లో తెలిపింది.
Read Also: Minister Roja: ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా జగన్ను ఏమి చేయలేవు..
మరోవైపు చంద్రబాబుపై నమోదైన అన్ని కేసుల్లో సీఐడీ వేగం పెంచింది. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసులలో చార్జిషీట్ వేయటానికి సీఐడీ సిద్ధమవుతుంది. ఇప్పటికే ఐఆర్ఆర్ కేసులో చార్జిషీట్ ను సీఐడీ దాఖలు చేయగా.. మరో 10 రోజుల వ్యవధిలో స్కిల్ కేసు, ఫైబర్ నెట్ కేసు, లిక్కర్, మద్యం కేసుల్లో కూడా సీఐడీ చార్జి షీట్ వేయనుంది. ఈ మేరకు చార్జిషీట్లను సిద్ధం చేసే పనిలో సీఐడీ నిమగ్నమై ఉంది. వీలైనంత వరకు చార్జిషీట్లు వేయటానికి సీఐడీ ప్రయత్నాలు చేస్తుంది.
Read Also: Heartbreaking story: ట్రెక్కింగ్‌కి వెళ్లి ఇద్దరు మృతి.. రెండు రోజుల పాటు డెడ్‌బాడీలకు కుక్క కాపలా..