మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్ధిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎం తెలిపారు. ఆలస్యమైనా వారికి ఈ గౌరవం దక్కడం గర్వకారణం ఉందని పేర్కొన్నారు. నా తరపున, సభ తరపున, తెలంగాణ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. పీవీ నరసింహా రావుకు భారత రత్న దక్కడంపై ఇది మనందరికీ గర్వకారణం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
HMDA shiva balakrishna: బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో కీలక విషయాలు..
తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ గార్లకు భారతరత్న రావడం సంతోషకరం. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
IPL 2024: ఐపీఎల్ 2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడికి గాయం!
తెలంగాణ ప్రియతమ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. భారతరత్న దేశ అత్యున్నత పౌర పురస్కారం. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు కూడా కేంద్రం శుక్రవారం భారతరత్న అవార్డును ప్రదానం చేసింది. దీంతో అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పీవీకి భారతరత్న ప్రకటించడంపై పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Pakistan Election: ఫలితాల్లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ జోరు.. తాజా అప్‌డేట్ ఇదే!