కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్టు బోండా ఉమ ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా ఉమా అభియోగం మోపారు. సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. గతంలో తాము ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి, గుడివాడ అమర్నాధ్ వెల్లడి చేశారన్నారు. గత తెలంగాణ ప్రభుత్వం…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో శనివారం రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో పంజాబ్-ఢిల్లీ తలపడుతున్నాయి. ఈ క్రమంలో.. మొదటగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. చివరలో అభిషేక్ పోరల్ (32) పరుగులతో రాణించాడు. చివరి ఓవర్లోనే 4,6,4,4,6,1 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు పోరాడే స్కోరు చేసింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ బ్యాటింగ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (29), మిచెల్ మార్ష్ (20) పరుగులు…
ఐపీఎల్ సీజన్ 17లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లోనే తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. అది కూడా.. కొత్త కెప్టెన్ రుతురాజ్ సారథ్యంలో మ్యాచ్ విన్ అయ్యారు. ఈ సీజన్ లో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు గైక్వాడ్ చేపట్టారు. ఇకపోతే.. కెప్టెన్ గా రుతురాజ్ వ్యవహరించడమే కానీ, మ్యాచ్ లో మొత్తం సూచనలిచ్చేది మాత్రం ధోని అనే చెప్పాలి. ఎందుకంటే.. అతనికి కెప్టెన్ గా చేసిన అనుభవం ఎంతో ఉంది గనుక.. వెనుక నుండి…
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం ఏర్పడింది. టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో.. టీడీపీని వీడేందుకు గోపాల్ యాదవ్ సిద్ధమయ్యారు. ఆయన ఎంపీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో నెల్లూరు వైసీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే అప్పుల లెక్కలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు.. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు అలాంటివి నమ్మాల్సిన అవసరం లేదు.. రాష్ట్రంలో…
ఐపీఎల్ అంటే ఇష్టపడని ఎవరు ఉంటారు. అందులోనూ సీఎస్కే-ఆర్సీబీ మ్యాచ్ అంటే.. క్రికెట్ అభిమానులకు పండగే. చెన్నై చెపాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ-చెన్నై మ్యాచ్ ను జియో సినిమాలో అత్యధికంగా 26 కోట్లకు మందిపైగా వీక్షించారు. మొదటి మ్యాచ్ లోనే ఇలా చూశారంటే.. ముందు ముందు ఇంకెంత వ్యూయర్ షిప్ పెరుగుతుందో.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెన్లరుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (21) ఫాఫ్ డుప్లెసిస్ (35) పరుగులు చేశారు. ఆ తరవాత బ్యాటింగ్ కు దిగిన రజతన్ పాటిదర్, గ్లేన్ మ్యాక్స్ వెల్ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత కెమెరన్…
ఐపీఎల్ 17వ సీజన్ లో కింగ్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మొదటి మ్యాచ్ లోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో 12000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ప్రపంచంలో ఆరో బ్యాట్స్‌మెన్‌గానూ, ఇండియా నుంచి ఈ రికార్డు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ నిలిచాడు. విదేశీ బ్యాటర్లలో క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. కోహ్లీ ఇప్పటివరకు 377 టీ20ల్లో విరాట్ 12వేల పరుగుల మైలురాయిని…
కాసేపట్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో చెన్నై - ఆర్సీబీ తలపడుతున్నాయి. కాసపటి క్రితమే టాస్ వేయగా.. ఆర్సీబీ టాస్ గెలించింది. మొదటగా బ్యాటింగ్ తీసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుఫున రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు. ఓ కారులో నగదు తీసుకువెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నగదు.. సుమారు కోటి 50 లక్షలు ఉన్నట్లు సమాచారం.