ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ (IT)లో ఉద్యోగం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలా మంది యువత ఇందులో పని చేయాలని కలలు కంటూంటారు. అయితే.. ఈడీ, ఆదాయపు పన్ను శాఖలో పని చేయాలనుకునే వారు.. ఈ రెండు ఏజెన్సీల గురించి తెలుసుకోవాలి. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అనేవి రెండు వేర్వేరు ప్రభుత్వ సంస్థలు. ఇవి.. ఆర్థిక అమలు, పన్నుల రంగంలో ఇవి విభిన్న పాత్రలు మరియు బాధ్యతలను కలిగి ఉంటాయి. ఈడీ, ఐటీకి సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలుపొందింది. 20 పరుగుల తేడాతో లక్నోపై రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని లక్నో ముందు ఉంచిన రాజస్థాన్.. 173 పరుగులకే కట్టడి చేసింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదివారం జాతీయ సెలక్షన్ కమిటీని తొలగించింది. 2024 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో.. కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం లాహోర్‌లోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, మాజీ చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ మధ్య జరిగిన సమావేశం అనంతరం పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యా్చ్ ప్రారంభం కానుంది. ఈసారి ముంబై జట్టు కొత్త కెప్టెన్ హార్థిక్ పాండ్యాతో బరిలోకి దిగుతుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. 33 బంతులు ఆడిన సంజూ.. హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాకుండా.. వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో 50 పరుగులు అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేసిన ఆటగాడిగా సంజూ నిలిచాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ఈ నెల 21న ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది.. ఆ షెడ్యూల్ ను త్వరలోనే విడుదల కానుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. సన్ రైజర్స్ ఓడిపోతామనే మ్యాచ్ను గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు హెన్రీచ్ క్లాసెన్. ఆ తర్వాత గెలుస్తుందని అందరూ అనుకున్నప్పటికీ క్లాసెన్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఓడిపోయింది. క్లాసెన్ ఔట్ తో సన్ రైజర్స్ అభిమానులతో పాటు.. సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ తీవ్ర నిరాశ చెందింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు డబుల్ ధమాకా మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జేయింట్స్ మధ్య జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ముందుగా రాజస్థాన్ ను బ్యాటింగ్ కు పంపించింది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.
ఢిల్లీ మెట్రో రైలులో ఇప్పటి వరకు ఎన్నో రకాల వీడియోలు తీసి వైరల్ చేసిన సంగతి తెలిసిందే. వైరల్ వీడియోల్లో ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు నిత్యం కనపడుతూనే ఉంటాయి. అందులో డ్యాన్స్ చేసేవి, కొట్టుకునేవి, పాటలు పాడేవి ఇలాంటి ఎన్నో రకాలైన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెట్రో రైలులో ఇద్దరు అమ్మాయిలు హోలీ వేడుకలు జరుపుకుంటున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై స్పందించిన ఢిల్లీ మెట్రో…
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ యువతి దుర్మరణం చెందింది. మృతురాలిని అర్షియా జోషిగా గుర్తించారు. మార్చి 21న ఆర్షియా జోషీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గతేడాది ఈ యువతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ ఘటన గురించి జోషి కుటుంబానికి భారతీయ రాయబార కార్యాలయం సమాచారం అందించింది. ఘటనపై న్యూయార్క్‌లో భారతీయ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆదివారం ట్వీట్ చేసింది. ఆమె భౌతికకాయాన్ని…