ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో శనివారం రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో పంజాబ్-ఢిల్లీ తలపడుతున్నాయి. ఈ క్రమంలో.. మొదటగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. చివరలో అభిషేక్ పోరల్ (32) పరుగులతో రాణించాడు. చివరి ఓవర్లోనే 4,6,4,4,6,1 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు పోరాడే స్కోరు చేసింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ బ్యాటింగ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (29), మిచెల్ మార్ష్ (20) పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ కు దిగిన షై హోప్ (33) పరుగులతో రాణించాడు. ఇక.. 15 నెలల తర్వాత బ్యాట్ పట్టిన రిషబ్ పంత్ (18) పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (21) పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు.

Read Also: Kejriwal Arrest: అధికారి దురుసు ప్రవర్తన.. కోర్టుకు కేజ్రీవాల్ ఫిర్యాదు
ఇక.. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్ తలో రెండు వికెట్లు సాధించారు. కగిసో రబాడ, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలో వికెట్ సంపాదించారు. ఒకానొక సమయంలో ఢిల్లీ బ్యాటింగ్ లో కొంత ఇబ్బంది తలెత్తింది. స్వల్ప స్కోరు చేస్తుందనే అనుకున్నప్పటికీ.. ఇంపాక్ట్ ప్లేయర్ కింద బరిలోకి దిగిన అభిషేక్ పోరల్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఢిల్లీ స్కోరు పరుగులు తీసింది.
Read Also: Asia’s Largest Tulip Garden: తెరుచుకున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!