ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెన్లరుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (21) ఫాఫ్ డుప్లెసిస్ (35) పరుగులు చేశారు. ఆ తరవాత బ్యాటింగ్ కు దిగిన రజతన్ పాటిదర్, గ్లేన్ మ్యాక్స్ వెల్ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత కెమెరన్ గ్రీన్ (18) పరుగులు చేశారు. ఒక దశలో బెంగళూరు 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అనుజ్ రావత్ (48), దినేష్ కార్తీక్ (38) చివరకు ఉండటంతో.. ఆర్సీబీ గౌరవ ప్రదమమైన స్కోరు చేసింది.
Ayesha Khan: ఓర్నీ.. ఈ పిల్ల జోరు మాములుగా లేదుగా.. మరీ ఇంత ఫాస్టా..?
ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ లో ముస్తాఫిజుర్ రెహమాన్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ కు ఒక వికెట్ దక్కింది. మిగతా బౌలర్లలో ఎవరూ వికెట్ సంపాదించలేదు.