ఐపీఎల్ 17వ సీజన్ లో కింగ్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మొదటి మ్యాచ్ లోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో 12000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ప్రపంచంలో ఆరో బ్యాట్స్‌మెన్‌గానూ, ఇండియా నుంచి ఈ రికార్డు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ నిలిచాడు. విదేశీ బ్యాటర్లలో క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. కోహ్లీ ఇప్పటివరకు 377 టీ20ల్లో విరాట్ 12వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్ (భారత్), ఆర్‌సీబీ ఫ్రాంచైజీ, డొమెస్టిక్ టీ20లను కలిపి కోహ్లీ ఈ పరుగులు సాధించాడు.
Kejriwal: కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. కస్టడీ విధింపు
టీ-20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు వీళ్లే..
క్రిస్ గేల్- 463 మ్యాచ్‌లు, 14562 పరుగులు, 36.22 సగటు, 22 సెంచరీలు, 88 అర్ధసెంచరీలు.
షోయబ్ మాలిక్- 542 మ్యాచ్‌లు, 13360 పరుగులు, 36.40 సగటు, 83 అర్థశతకాలు
కీరన్ పొలార్డ్- 660 మ్యాచ్‌లు, 12900 పరుగులు, 31.46 సగటు, 1 సెంచరీ, 59 అర్ధశతకాలు
అలెక్స్ హేల్స్- 449 మ్యాచ్‌లు, 12319 పరుగులు, 29.68 సగటు, 6 సెంచరీలు, 78 అర్ధసెంచరీలు.
డేవిడ్ వార్నర్- 370 మ్యాచ్‌లు, 12065 పరుగులు, 37.12 సగటు, 8 సెంచరీలు, 101 అర్ధసెంచరీలు.
కాగా.. ఆర్సీబీ-చెన్నై మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు.. ఆరంభంలో అదరగొట్టింది. ఓపెనర్ డుప్లెసిస్ ఉన్నంతసేపు దూకుడగా ఆడాడు. ఆ తర్వాత అతని వికెట్ కోల్పోగానే.. వరుసగా రెండు వికెట్లు కోల్పోయాయి. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (21), గ్రీన్ (16) పరుగులతో ఉన్నారు.