ఐపీఎల్ అంటే ఇష్టపడని ఎవరు ఉంటారు. అందులోనూ సీఎస్కే-ఆర్సీబీ మ్యాచ్ అంటే.. క్రికెట్ అభిమానులకు పండగే. చెన్నై చెపాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ-చెన్నై మ్యాచ్ ను జియో సినిమాలో అత్యధికంగా 31 కోట్లకు మందిపైగా వీక్షించారు. మొదటి మ్యాచ్ లోనే ఇలా చూశారంటే.. ముందు ముందు ఇంకెంత వ్యూయర్ షిప్ పెరుగుతుందో.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెన్లరుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (21) ఫాఫ్ డుప్లెసిస్ (35) పరుగులు చేశారు. ఆ తరవాత బ్యాటింగ్ కు దిగిన రజతన్ పాటిదర్, గ్లేన్ మ్యాక్స్ వెల్ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత కెమెరన్ గ్రీన్ (18) పరుగులు చేశారు. చివర్లో అనుజ్ రావత్ (48), దినేష్ కార్తీక్ (38) పరుగులు చేయడంతో.. ఆర్సీబీ గౌరవ ప్రదమమైన స్కోరు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ లో ముస్తాఫిజుర్ రెహమాన్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ కు ఒక వికెట్ దక్కింది. మిగతా బౌలర్లలో ఎవరూ వికెట్ సంపాదించలేదు.
Read Also: Inscription Found : 900 ఏళ్ల నాటి కన్నడ శాసనం లభ్యం