ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం ఏర్పడింది. టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో.. టీడీపీని వీడేందుకు గోపాల్ యాదవ్ సిద్ధమయ్యారు. ఆయన ఎంపీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది.
Shaharyar Khan: పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ కన్నుమూత
కొన్ని రోజులుగా ఏలూరు సీటు తనదేనని ప్రచారం చేసుకున్న గోపాల్ యాదవ్.. ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో గోపాల్ యాదవ్ కు టీడీపీ అధిష్టానం హ్యాండిచ్చింది. దీంతో.. రేపు ఆత్మీయ సమావేశానికి గోపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. మరోవైపు.. అటు టీడీపీకి టికెట్ కేటాయించడంపై బీజేపీలో అసమ్మతి గళం వినిపిస్తోంది. పదేళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్న గారపాటి చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులను కాదని కడప జిల్లాకు చెందిన వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారంటుూ బీజేపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది.
AAP Office: ఢిల్లీ ఆప్ కార్యాలయానికి సీల్.. నేతల మండిపాటు
గతేడాది కాలంగా.. టీడీపీ నుంచి గోపాల్ యాదవ్ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ.. అనేక పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ స్థానికుడుకి కాకుండా.. వేరే వ్యక్తికి సీటు కేటాయించడంతో గోపాల్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీతో కొనసాగాలా.. పార్టీని వీడాలన్న నిర్ణయంపై క్లారిటీ రానుంది. మరోపక్క బీజేపీ కోసం 16 ఏళ్ల పాటు పనిచేసిన గారపాటి చౌదరిని పక్కకు పెట్టడంపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమస్యలు తెలిసినటువంటి వారికి సీటు కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో.. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.