ఐపీఎల్ సీజన్ 17లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లోనే తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. అది కూడా.. కొత్త కెప్టెన్ రుతురాజ్ సారథ్యంలో మ్యాచ్ విన్ అయ్యారు. ఈ సీజన్ లో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు గైక్వాడ్ చేపట్టారు. ఇకపోతే.. కెప్టెన్ గా రుతురాజ్ వ్యవహరించడమే కానీ, మ్యాచ్ లో మొత్తం సూచనలిచ్చేది మాత్రం ధోని అనే చెప్పాలి. ఎందుకంటే.. అతనికి కెప్టెన్ గా చేసిన అనుభవం ఎంతో ఉంది గనుక.. వెనుక నుండి అన్నీ తానే నడిపిస్తాడు. ఇక.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ధోని వికెట్ వెనుకలా నుంచి అద్భుతమైన క్యాచ్ లు పట్టాడు. ఇక.. బ్యాటింగ్ విషయానికొస్తే.. ధోని వరకు రానివ్వకుండానే మ్యాచ్ ముగించేశారు. ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. కానీ.. అతని బ్యాటింగ్ చూసే అవకాశం రాలేదు.

AP Politics: ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం..
మరోవైపు.. ధోనీపై వెస్టిండీస్ మాజీ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లు ఆడకపోవచ్చని గేల్ తెలిపారు. ఈ సీజన్ లో కెప్టెన్ కూల్ బహుశా అన్ని మ్యాచ్ లు ఆడరని పేర్కొన్నారు. టోర్నమెంట్ మధ్యలో స్వల్ప విరామం తీసుకోవచ్చని.. అందుకే నాయత్వ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించారన్నారు. అయినా ధోనీ బాగానే రాణిస్తారు.. దీని గురించి చింతించకండి అని గేల్ తెలిపారు.
Heavy rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఇక.. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ప్రారంభంలోనే చెన్నై తన ఖాతాలో వేసుకుంది. చెన్నై తర్వాత మ్యాచ్ మార్చి 26న గుజరాత్ తో తలపడనుంది.