పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని జనసేన ప్రకటించింది. వారాహి వాహనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం మొదలు పెడతారని తెలిపింది. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలో.. పవన్ ఎన్నికల ప్రచారంపై జనసేన కసరత్తు ప్రారంభించింది. శక్తిపీఠం కొలువైన క్షేత్రం.. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచే ప్రచారం మొదలుపెట్టాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. పురుహూతిక దేవికి పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం…
ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా.. ఎన్డీఏ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని తెలిపారు. కొందరు ఐపీఎస్ అధికారులు ఈ తరహా అధికార దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ సీఈఓకి ఫిర్యాదు చేశామని బోండా ఉమ…
విశాఖ డ్రగ్స్ రవాణా పంచాయతీ ఈసీకి చేరింది. విశాఖ డ్రగ్స్ రవాణాకు.. తమకు లింకులున్నాయన్న టీడీపీ ఆరోపణలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆధారాల్లేని ఆరోపణలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పురంధేశ్వరి సన్నిహితులకే డ్రగ్స్ రవాణతో సంబంధం ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. డ్రగ్స్ రవాణా విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేసింది. సీబీఐ చెప్పిన అంశాల ఆధారంగానే తాము ఆరోపణలు చేస్తున్నట్లు…
బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ పై సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు. విశాఖ పోర్టులో తనిఖీలకు వచ్చిన సీబీఐ, కస్టమ్స్ అధికారులను కంటైనర్ తెరవకుండా ఆపడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. డ్రగ్స్ దిగుమతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండానే ఇన్ని వేల కోట్ల మాదకద్రవ్యాలను డ్రై ఈస్ట్ పేరుతో దిగువమతి చేశారా అని…
ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభ వేళ.. ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లకు శుభవార్త చెప్పింది. రూ. 49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ తో రోజుకు 25 జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ ఉన్న వారికే ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. ఎయిర్టెల్ లోనూ ఇదే ప్లాన్ ఉండగా.. 20 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.
కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవూరు నియోజకవర్గంలో కొందరు నేతలు తనను అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నారని ఆరోపించారు. వాళ్ళు ఎంతెంత సంపాదించారో తన దగ్గర జాబితా ఉందన్నారు. ఈరోజు తనను వదిలి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాంటి నేతలను వైసీపీలో చేర్చుకుని తప్పు చేశానని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వైజాగ్ డ్రగ్ కేసులో గుమ్మడి కాయ దొంగ అంటే బుజాలు తడుముకున్నట్టు ఉంది టీడీపీ పరిస్థితి అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ కు ఆరోపణలు చేయడానికి బుద్ధి ఉండాలి కదా? అని దుయ్యబట్టారు. తమ పై విమర్శలు చేస్తున్నారు.. ఆ కంపెనీలు పురంధేశ్వరి దగ్గరి బంధువులది అని అంటున్నారని సజ్జల పేర్కొన్నారు. వైజాగ్ డ్రగ్ కేసులో టీడీపీ నేతల సంబంధం ఉన్నట్టు బలంగా అనిపిస్తుందని తెలిపారు. వైజాగ్ డ్రగ్ కేసులో ఎవరు ఉన్నారో విచారణ చేయాలని కేంద్ర…
వైసీపీ నాయకులు కార్యక్రమాల్లో వాలంటీర్లు కనబడితే తమ వాట్సాప్ నెంబర్ కు సమాచారం పంపించమని ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ టీడీపీ నాయకులు ప్రారంభించారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. వాలంటీర్లు సాధారణ మనుషులు కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్లను టీడీపీ, ఐటీడీపీ భయపెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అభం శుభం తెలియని వాలంటీర్లపై ఎమ్మెల్యే కాండిడేట్ ఆదిరెడ్డి వాసు కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్ర ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్ట్ ను ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షలో భాగమేనని ఆరోపించారు. గుజరాత్ లో నేరాలు చేసిన వారిని మాత్రం నిర్దోషులుగా క్షమాభిక్ష పెడుతున్నారని.. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరగడం శోచనీయం అని పేర్కొన్నారు.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-ఆర్సీబీ మధ్య జరుగనుంది. అందుకోసం ఫ్యాన్స్ ఇప్పటికే.. చెన్నై చెపాక్ స్టేడియానికి భారీగా చేరుకుంటున్నారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్లో బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.