Vijayasai Reddy: చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో నెల్లూరు వైసీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే అప్పుల లెక్కలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు.. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు అలాంటివి నమ్మాల్సిన అవసరం లేదు.. రాష్ట్రంలో దుష్ప్రచారం మొదలు పెట్టారని దుయ్యబట్టారు. టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన వారే బెట్టింగ్ కు నిధులు ఇస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ప్రజల గుండెల్లో వైసీపీ ఉంది.. ఐదు సంవత్సరాలలో జగన్ వారి మనసుల్లో నిలిచిపోయారని తెలిపారు.
చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు.. ఈ ఎన్నికల తరువాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. లోకేష్ అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు.. ఇక టీడీపీ అనేది ఉండదని విమర్శించారు. బీజేపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీ బీజేపీలో విలీనం కావాల్సిందేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏందంటే.. బీజేపీలో విలీనం చేయడం తప్ప వారికి వేరే దారిలేదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో మంచి సంబంధాలు మాత్రమే కొనసాగించాం.. అప్పుడే రాష్ట్రానికి సంబంధించిన నిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మరోవైపు.. నెల్లూరు లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాం.. నెల్లూరు టౌన్ విషయంలో ఛాలెంజ్ జరుగుతోంది.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా వైసీపీనే గెలుస్తోందని విజయసాయి రెడ్డి తెలిపారు.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
Neha Sharma: చిరుత నటి పొలిటికల్ ఎంట్రీ.. లోక్‌సభ ఎన్నికల బరిలో నేహా!
ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయ్ సాయి రెడ్డి గెలిస్తే నెల్లూరులో ఉండడని వేమిరెడ్డి అన్నారని.. ఈయన విజయసాయి రెడ్డి గురించి మాట్లాడటం సరికాదని తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబానికి సాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు.. కుటుంబ సభ్యుడు అని చెప్పారు. నిజాయితీగా చిత్తశుద్ధిగా ఆ కుటుంబం మీద అభిమానంతో ఇప్పటికీ ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా వేమిరెడ్డి గురించి చెబుతారు.. రాజకీయ బిక్ష పెట్టిన జగన్ కు వెన్నుపోటు పొడిచి పొగరుతో అహంకారంతో బయటికి వెళ్లారని చెబుతారన్నారు. ఒకప్పుడు నెట్టేసిన చంద్రబాబు దగ్గరికి చేరారు.. అమ్మ ప్రశాంతమ్మ నీ రెండో భర్తని నెత్తినెక్కించుకుని ఏవేవో మాట్లాడుతున్నావు…
ఎమ్మెల్యే, మంత్రి రావాలని ప్రశాంతి రెడ్డి కోరిక కలగానే మిగిలిపోతుందని ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?