జగిత్యాల జిల్లాలో గంజాయి మూలాలు కలకలం రేపుతున్నాయి. పదవ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసైన విషయం విస్మయానికి గురి చేస్తుంది. జగిత్యాలలో విద్యార్థినులు గంజాయి మత్తులో చిత్తు అవుతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులు అధిక మొత్తంలో గంజాయికి బానిస అయ్యారు. ఈ విషయాన్ని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
రంగుల పండుగ హోలీ రంగుల ఆనందాన్ని తెస్తుంది. హోలీని చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగులు పూసుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే రంగులు అనుకోకుండా కళ్ళు, చెవులల్లో పడుతుంది. ఆ తర్వాత నోటిలోకి వెళ్తుంది. ఈ రంగుల్లో కలిపిన రసాయనాల వల్ల హాని జరిగే ప్రమాదం ఉంది. అందుకే హోలీ ఆడే సమయంలో చెవులు, కళ్లు, నోటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొరపాటున నోటిలోకి రంగు చేరితే ఎలాంటి వ్యాధులు వస్తాయనే ప్రశ్నలు…
నకిలీ అంబులెన్స్ కేసులో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గురువారం బారాబంకి ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ముఖ్తార్ అన్సారీ కోర్టులో ఒక దరఖాస్తు ఇచ్చారు. జైల్లో తనకు స్లో పాయిజన్ ఇస్తున్నారని అన్సారీ ఈ దరఖాస్తులో ఆరోపించారు. ఇది తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. కాగా.. తనకు వైద్యం చేసేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని అన్సారీ కోర్టును అభ్యర్థించారు.
హోలీని చిన్న నుంచి మొదలుపెడితే పెద్దల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. రంగు రంగు రంగులతో హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. బంధువులు, స్నేహితులు అంతా కలిసి ఈ కలర్ ఫుల్ హోలీని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే.. ఒకప్పటిలా నేచురల్గా తయారుచేసిన రంగులతో జరుపుకోవడం కాకుండా.. అంతా కెమికల్ తో తయారయ్యే రంగులను చర్మానికి పూసుకుంటున్నారు. దానివల్ల చర్మం, జుట్టు పాడవుతుంది. అయితే అలా కాకుండా.. చర్మాన్ని, జుట్టును కాపాడుకోవడం కోసం కొన్ని టిప్స్ ఉన్నాయి.. అలా చేయడం వల్ల జాగ్రత్తగా ఉండొచ్చు.
సమ్మర్లో ఎండలో కాసేపు బయటికి వెళ్లి వస్తే.. గొంతు ఎండుకుపోతుంది. చల్లగా ఏదొకటి తాగాలని అనిపిస్తుంది. తాగే ముందు కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి ఎంచుకుంటారు. దీంతో శరీరం లోపల చల్లదనంతో పాటు.. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎండాకాలంలో కూల్ గా ఏ డ్రింక్స్ తాగితే మంచిదో తెలుసుకుందాం.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తాజాగా.. మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం పశ్చిమ బెంగాల్‌లోని తాను పోటీ చేస్తోన్న లోక్ సభ నియోజకవర్గం బెర్‌హమ్‌పోర్లో ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.
ఐపీఎల్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఒక జట్టు తర్వాత ఒక జట్టు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇప్పటికే సీఎస్కే బౌలర్ మహీష్ పతిరణ గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు దూరం కానుండగా.. తాజాగా రాజస్థాన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఐపీఎల్ కు దూరం కానున్నాడు. కాగా.. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్…
భారతదేశ ప్రజలు హోలీ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. రంగులు జల్లుకుంటూ ప్రతీ ఒక్కరు సంబరాలు జరుపుకునే ఈ పండుగ కోసం.. ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తుంటారు. దేశంలో ప్రతీ వీధి, ప్రతీ ప్రాంతం రంగులతో నిండిపోయే ఏకైక వేడుక ఇదే. అయితే హోలీ జరుపుకోవడంలో ప్రతీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకనే ఉన్నవాటిలో ఉత్తమమైనవి ఏవో తెలుసుకుంటే.. ఈ సారి హోలీని ఎంజాయ్ చేయడానికి ముందుగానే సిద్ధం కావచ్చు. ఇండియాలో హోలీ జరుపుకునేందుకు బెస్ట్ ప్రాంతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) కన్నుమూశారు. అహ్మద్ 1958-73 మధ్య పాక్ తరఫున 41 టెస్టులు ఆడారు. అందులో 5 సెంచరీలు, 16 అర్ధ శతకాలతో 2991 పరుగులు చేశారు. అంతేకాకుండా.. అహ్మద్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ కాగా.. 22 వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే.. అహ్మద్ చేసిన 5 శతకాలలో మూడు ఇండియాపైనే నమోదు చేశారు.
ఐపీఎల్ లో ఎక్కువ క్రికెట్ అభిమానులు ఉన్న జట్లు ఏవైనా ఉంటే.. అవి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. ఎందుకంటే.. తన అభిమాన కెప్టెన్లు ఉండటం వల్లనే ఆ జట్లకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్ లో చెన్నై, ముంబై మ్యాచ్ ఉందంటే చాలు.. టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు. తమ అభిమాన కెప్టెన్లు ఉండటం వల్ల, వారు ఆటలో రచించే వ్యూహాలు అభిమానులకు నచ్చుతాయి కాబట్టి.. ఆ జట్లకు అంతా క్రేజ్ ఉంది.