కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి జంటనగరాల్లో వైన్ షాపులు క్లోజ్ అవనున్నాయి. అంతేకాకుండా.. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని వైన్ షాపులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగొద్దని మద్యం దుకాణాలు మూయాలని సూచించారు. మరోవైపు.. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులు యథావిధిగా నడవనున్నాయి. ఈమేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు ఆదేశాలు జారీ చేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్-సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరివరకు ఉత్కంఠగా సాగింది. ఉత్కంఠపోరులో కోల్ కతా గెలుపొందింది. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరలో క్లాసెన్ కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి ఓవర్ లో సన్ రైజర్స్ గెలుస్తుందని అనుకుంటే.. హర్షిత్ రాణా వేసిన బౌలింగ్ లో కీలక క్లాసెన్ (63) వికెట్ తీశాడు. అంతకుముందు షాబాజ్ అహ్మద్ ను ఔట్ చేశాడు. చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండా కమిన్స్…
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. కానూరులోని యార్లగడ్డ గ్రాండియర్ లో భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరిగాయి. గన్నవరం నియోజకవర్గంలోని ఏడు గ్రామాల నుంచి సుమారు నాలుగు వందల మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన పలువురు నేతలు మాట్లాడుతూ.. యార్లగడ్డ గెలుపుకోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తామని తెలిపారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్.. మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ముందు ఓ భారీ టార్గెట్ ను ఉంచింది. కోల్ కతా బ్యాటింగ్ లో ముందుగా ఓపెనర్లు.. ఫిలిప్ సాల్ట్ (54) పరుగులతో చెలరేగాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్…
ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు, పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయని పేర్కొ్న్నారు. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖలోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెపుతుంటే ఈ సీఎంకు సిగ్గు అనిపించడం లేదా? అని…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రెండో మ్యాచ్ లో ఢిల్లీపై పంజాబ్ గెలిచింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సామ్ కరణ్ (63), లివింగ్ స్టోన్ (38*) పరుగులతో రాణించడంతో జట్టు విజయం సాధించింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. ఓపెనర్లు శిఖర్ దావన్ (22), బెయిర్ స్టో (9) పరుగులు చేశారు. ఆ తర్వాత ప్రభుసిమ్రాన్ సింగ్ (26), జితేష్…
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా.. ఈరోజు మరో మ్యాచ్ జరుగనుంది. మరికాసేపట్లో కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కెప్టెన్ గా కమిన్స్ బరిలోకి దిగుతున్నాడు.
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారయ్యారు. ఇక్కడి నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. ఈ మేరకు నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. మూడు పార్టీలను కలుపుకుని పని చేస్తానని, పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ఇక్కడి నుంచి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు.
ఢిల్లీలో మరికాసేపట్లో బీజేపీ సమావేశం కానుంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో.. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్దులు. ఖరారు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. ఏపీలో స్థానాలు, అభ్యర్ధుల ఖరారు పై సుదీర్ఘంగా బీజేపీ నేతల మధ్య చర్చోపచర్చలు సాగాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు టికెట్ కేటాయించారు. తొలుత తెలుగుదేశం ఫస్ట్ లిస్టులో మహాసేన రాజేష్ కు గన్నవరం సీటు కేటాయించారు. మహాసేన రాజేష్ కు కేటాయించడం పట్ల తెలుగుదేశం జనసేనతో పాటు హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో టిక్కెట్ మార్పు చేశారు.