ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్- కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీలోని ఫతేహాబాద్‌లో రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి హోతమ్ సింగ్ మద్దతుగా సభలో ప్రసంగిస్తుంగా స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. అయితే స్వామి ప్రసాద్ మౌర్య తృటిలో తప్పించుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. సభా స్థలికి వెళుతున్న స్వామి ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన చేపట్టారు.
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ చీపురుపల్లి, విజయనగరంలో పర్యటనలో మాట్లాడే తీరు చూశానని.. పేపర్లు ఇటుతిప్పి అటుతిప్పి మాట్లాడారని ఎద్దేవా చేశారు. అసలు భౌగోళిక పరిస్థితులపై అసలు అవగాహన ఉందా అని విమర్శించారు. బాలకృష్ణ విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్ కి రండి అని మంత్రి బొత్స సవాల్ విసిరారు. కళ్లులేని కబోదికి ఏం తెలుస్తుంది ఆ విధంగా ఉంది ప్రసంగమని అన్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్ పరీక్షలకు తరఫీదు ఇస్తున్నాం.. మండలానికి పది…
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శుక్రవారం మూడు ఫార్మాట్‌ల (టెస్ట్, వన్డే మరియు టి20 ఇంటర్నేషనల్) వార్షిక ర్యాంకింగ్‌లను నవీకరించిన తర్వాత తాజా జట్టు ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. వన్డే, టీ20ల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. వన్డేల పట్టికలో భారత్ 122 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వన్డేల్లో భారత్ ఆధిక్యాన్ని మూడు నుంచి ఆరు పాయింట్లకు పెంచుకుంది. టాప్ 10లో ఎటువంటి మార్పు లేదు.. కానీ ఐర్లాండ్ జింబాబ్వేను అధిగమించి 11వ స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా (116) పాయింట్లతో రెండవస్థానంలో.. దక్షిణాఫ్రికా (112) మూడో…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. తన బర్త్ డేను ఆర్సీబీ ప్లేయర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో విరాట్, అనుష్కతో పాటు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ దంపతులు హాజరై సందడి చేశారు. కాగా.. ఈ నెల 1న అనుష్క పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క ఫొటోకు పోజులివ్వడం ఇదే తొలిసారి. ఈ ఫొటోను…
సీఎస్కేకు సూపర్ ఫ్యాన్ అయిన ఎస్.రాందాస్ (103) అనే వృద్ధుడికి మహేంద్ర సింగ్ ధోనీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన జెర్సీపై తన సంతకం, ప్రత్యేక సందేశం రాసి రాందాస్ కొడుకు అందిచారు. ధోనీ పంపిన జెర్సీని చూసి తాత హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ చెన్నై జట్టుపై రాందాస్ తన అభిమానాన్ని సీఎస్కే తమ ట్విట్టర్ అకౌంట్ లో పంచుకుంది.
న్యూయార్క్‌లో హోటల్ ధరలు ఆకాశన్నంటాయి. కారణమేంటంటే.. టీ20 వరల్డ్ కప్కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.. కాగా.. జూన్ 9వ తేదీన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ను లైవ్ లో చూడాలనుకునే ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. దాయాదుల మధ్య పోరు అంటే.. ఏ దేశంలో జరిగినా, డబ్బులు లెక్క చేయకుండా వెళ్తారు.
టీడీపీపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించి కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.. ఉద్యోగస్తులకు, పెన్షన్లర్లకు ప్రభుత్వం చేసిన మంచి విషయాలను దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం కావడంతో కొంతమంది ఓట్ల కోసం మాట్లాడుతున్నారు.. ఇది సరికాదని హితవు పలికారు. కోవిడ్ వల్ల ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీల విషయంలో జాప్యం జరిగింది.. దీనిని భూతద్దంలో చూపుతున్నారని మండిపడ్డారు. పది వేలకు మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ప్రభుత్వం పర్మినెంట్ చేసిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు…
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తాను వీరాభిమానిని అని సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. 'మా నాన్న కృష్ణ అభిమాని. పోకిరి సినిమా నుంచి నేను మహేశ్ను ఫాలో అవుతున్నా. ఆయన చేసే సినిమాలు చాలా స్ఫూర్తినిస్తాయి' అని నితీశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఐపీఎల్లో హైదరాబాద్ తరుఫున నిలకడగా రాణిస్తు్న్న నితీశ్.. జట్టులో కీలక ప్లేయర్గా మారి ప్రశంసలు పొందుతున్నాడు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. తమ నియోజకవర్గంలో గడపగడపకు వెళ్తూ.. తమ పార్టీ చేసిన మంచి పనులను వివరిస్తూ, ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగానే.. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూకట్పల్లిలో ఆయన తరుఫున కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు.