మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తల్లి లక్ష్మీ అనారోగ్యంతో కన్నుమూశారు. హన్మకొండలో ఓ ప్రయివేట్ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. బలరాం నాయక్ స్వస్థలం ములుగు జిల్లా మదనపల్లి గ్రామం. బలరాం నాయక్.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాగా.. గతంలో బలరాం నాయక్ కేంద్రమంత్రిగా పని చేశారు. 2012 అక్టోబరులో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. బలరాం నాయక్…
రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే క్వింటాలుకు మద్ధతు ధర రూ. 3180 చెల్లించి రైతుల వద్ద నుండి జొన్న కొనుగోలు చేస్తోంది. అయితే గత ఐదు సంవత్సరాల దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితిని విధించి కొనుగోలు చేస్తున్న సందర్భములో.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ యాసంగిలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, ఆ మేరకు ఎకరానికి ఇంతకుముందు ఉన్న పరిమితిని పెంచాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తులు వచ్చాయి.
ప్రస్తుత వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ మరియు వినియోగాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి విద్యుత్ శాఖ ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో.. చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈ సీజన్లో ఇప్పటికే…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పండని అన్నారు. బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ.. రిజర్వేషన్లకు వ్యతిరేక ఉండే బీజేపీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగేహక్కు లేదని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని తెలిపారు. తాము మండల కమిషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే.. మీరు దేశ…
కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీ. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలు దళితులను మోసం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు.. నిన్న పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇస్తూ.. రోహిత్ దళితుడే కాదని చెబుతోందని పేర్కొన్నారు. మనకులాల గురించి మనమే ఆలోచన చేయాలన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లు విజృంభణతో ముంబై చిత్తుగా ఓడిపోయింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా.. ముంబై ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. 19.5 ఓవర్లలో కేకేఆర్ 169 పరుగులు చేసి ఆలౌటైంది. కోల్కతా బ్యాటింగ్ లో వెంకటేష్ అయ్యర్ (70), ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనీష్ పాండే (42) పరుగులతో రాణించడంతో.. కోల్కతా ఫైటింగ్ స్కోరు చేయగలిగింది. టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ చివరకు వరకు ఉండి జట్టు స్కోరు పెంచాడు. అతనితో పాటు మనీష్ పాండే రాణించడంతో.. వారి…
పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి మెజార్టీ పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల వల్లే అది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు, తాను చేసిన అభివృద్ధి తన విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
కెనడా పర్యటనకు వెళ్లిన భారతీయ దంపతులు.. వారి మూడు నెలల మనవడు సహా నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మద్యం మత్తులో రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో.. ఈ ప్రమాదం జరిగిందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. టొరంటోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401లో నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారని అంటారియో పోలీసులు గురువారం తెలిపారు.
కజకిస్థాన్ మాజీ ఆర్ధిక మంత్రి కువాండిక్ బిషింబాయేవ్ (44) తన భార్య సాల్టానాట్ (31) ను కొట్టి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది. సాల్టానాట్ నుకెనోవా గత నవంబర్‌లో ఓ రెస్టారెంట్‌లో శవమై కనిపించింది. ఆ రెస్టారెంట్‌లో 8 గంటలపాటు తనభార్య సాల్టానాట్ పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మరణించింది.