ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో 'లోక్‌సభ ఎన్నికల'లో జరిగే అతిపెద్ద పండుగను చూసేందుకు 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలతో సంబంధం ఉన్న 75 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఇండియాకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, "మా ఆహ్వానం మేరకు, 23 దేశాల నుండి ఎన్నికల నిర్వహణ సంస్థలతో సంబంధం ఉన్న 75 మంది అంతర్జాతీయ ప్రతినిధులు మా ఎన్నికలను చూసేందుకు ఇక్కడకు రావడం చాలా సంతోషం మరియు సంతృప్తిని…
ఎన్డీఏ బలపరిచిన అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కురుపాం నియోజకవర్గం గుమ్మలక్షిపురం మండలంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారుమూల గ్రామాలైన కొత్తవలస, చింతలపాడు గ్రామాలలో పర్యటించిన కొత్తపల్లి గీతకు.. స్థానిక ప్రజలు సంప్రదాయ గిరిజన వాయిద్యాలత, థింసా నృత్యాలతో మహిళలు హారతులతో స్వాగతం పలుకగా గిరిజనులతో కలిసి థింసా నృత్యంలో కొత్తపల్లి గీత అడుగులు కలిపారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 148 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఒకానొక సమయంలో ఆర్సీబీ వికెట్లు పోతున్న సమయంలో గుజరాత్ వైపు మ్యాచ్ తిరిగింది. కానీ.. దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చి మ్యాచ్ను గెలిపించాడు. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ (42), డుప్లెసిస్ (64) పరుగులు చేయడంతో ఆర్సీబీ అలవోకంగా విజయం సాధించింది.
జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్.రమణ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతంతో ఓటమి చెందామని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.
మల్కాజ్గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్లో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు 10-12 సీట్లు గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటదని మాట్లాడుతున్నారు.. ఈ దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి.. అవన్నీ పెద్ద పార్టీలేనని తెలిపారు. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు.. మనం శాసించి లొంగదీసుకుందామా? యాచిద్దామా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పోయే…
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో హాట్ కామెంట్స్ చేశారు. వందసార్లు రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలారా.. అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అనే పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతో కార్పొరేటర్లను కాంగ్రెస్ కొంటోందని బండి సంజయ్ ఆరోపించారు.
ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, రాజ్యాంగం రద్దు చేస్తున్నారని.. అది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో తాము గెలిచేందుకు ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి సీఎం సర్టిఫికెట్…
పశ్చిమ బెంగాల్‌లో బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల హింసకు పేరుగాంచిన ముర్షిదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని శ్మశాన వాటికలు, పాఠశాలలు, ఐసిడీఎస్ కేంద్రాలు, ఆట స్థలాలలో బాంబ్ స్క్వాడ్ అనేక బాంబులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. బాంబుల తయారీకి సంబంధించిన కొన్ని కెమికల్స్ లభ్యమయ్యాయి. కాగా.. బాంబులు ఉన్నాయన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ(HCU) విద్యార్థి నేత రోహిత్ వేముల క్లోజర్ రిపోర్ట్ను రోహిత్ తల్లి రాధిక వ్యతిరేకిస్తున్నారు. రిపోర్ట్ను పూర్తిగా మార్చేసారని హెచ్సీయూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. తాజాగా.. రోహిత్ వేముల తల్లి రాధిక మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేముల ఎస్సీ కాదు అని పోలీసులు రిపోర్ట్ను హైకోర్టులో సబ్మిట్ చేశారని అన్నారు. రోహిత్ వేముల ముమ్మాటికీ ఎస్సీనేనని తెలిపారు. పోలీసులు రోహిత్ వేముల కులం గురించి తప్పుడు ప్రచారం…
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్ర రూపంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. కాగా.. ఇంతటి ఎండల్లో ఒక చల్లటి వార్త బయటికొచ్చింది. రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. చాలా చోట్ల ప్రజలు వేడిగాలులను ఎదుర్కొనే అవకాశం ఉంది.. అయితే కాలక్రమేణా పరిస్థితి మెరుగుపడి వేడిగాలులు తగ్గుతాయని పేర్కొంది.