అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన తర్వాత కూడా ఐపీఎల్‌లో కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. ప్రతిచోటా అతని అభిమానులు తమ అభిమాన స్టార్ బ్యాటింగ్‌ను చివరిసారి చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్ ముగిశాక రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఒక వీడియోను పంచుకుంది. అందులో ధోనీ 103 ఏళ్ల సూపర్ ఫ్యాన్ జంటకు తన ఆటోగ్రాఫ్ జెర్సీని ఇవ్వడం చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Konda Vishweswar Reddy: ప్రపంచంలో దేశాన్ని అగ్రభాగాన నిలపడమే మోడీ లక్ష్యం
సీఎస్కేకు సూపర్ ఫ్యాన్ అయిన ఎస్.రాందాస్ (103) అనే వృద్ధుడికి మహేంద్ర సింగ్ ధోనీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన జెర్సీపై తన సంతకం, ప్రత్యేక సందేశం రాసి రాందాస్ కొడుకు అందిచారు. ధోనీ పంపిన జెర్సీని చూసి తాత హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ చెన్నై జట్టుపై రాందాస్ తన అభిమానాన్ని సీఎస్కే తమ ట్విట్టర్ అకౌంట్ లో పంచుకుంది.
Washing Fruits: పండ్లపై ఉండే రసాయణాలు తొలగాలంటే ఇలా చేయండి..
రాందాస్ క్రికెట్ అభిమాని. నేటికీ అతను క్రికెట్ మ్యాచ్‌లు చూస్తాడు. కానీ.. క్రికెట్ ఆడటానికి భయపడతాడు. సీఎస్కేని ఉత్సాహపరచడం.. ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటం చాలా ఇష్టం. ఇంతకుముందు సీఎస్కే ఫ్రాంఛైజీ రిలీజ్ చేసిన వీడియోలో.. యాంకర్ రాందాస్ ను మీరు ఎంఎస్ ధోనీని కలవాలనుకుంటున్నారా? అడిగిన ప్రశ్నకు.. రాందాస్ కొంచెం చిరునవ్వుతో ‘అవును.’ అని చెప్పారు. రాందాస్ ఇప్పటికీ చెన్నై జట్టుకు ధోనీనే కెప్టెన్‌గా భావిస్తున్నాడు.
A gift for the 1⃣0⃣3⃣ year old superfan 💛
Full story 🔗 – https://t.co/oSPBWCHvgB #WhistlePodu #Yellove pic.twitter.com/hGDim4bgU3
— Chennai Super Kings (@ChennaiIPL) May 3, 2024