టీడీపీపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించి కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.. ఉద్యోగస్తులకు, పెన్షన్లర్లకు ప్రభుత్వం చేసిన మంచి విషయాలను దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం కావడంతో కొంతమంది ఓట్ల కోసం మాట్లాడుతున్నారు.. ఇది సరికాదని హితవు పలికారు. కోవిడ్ వల్ల ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీల విషయంలో జాప్యం జరిగింది.. దీనిని భూతద్దంలో చూపుతున్నారని మండిపడ్డారు. పది వేలకు మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ప్రభుత్వం పర్మినెంట్ చేసిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టి ఆయన మర్చిపోయారని ఆరోపించారు.
ఓట్ల కోసం మేనిఫెస్టోలో వాళ్లకు అవసరమైన అంశాలను పొందుపారుస్తారే తప్ప అమలు చేయరని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలము అమలు చేసిందన్నారు. వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న 15 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్ ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ సచివాల వ్యవస్థను తీసుకువచ్చింది.. లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు.. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బందిని పూర్తి స్థాయిలో భర్తీ చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు చెప్తున్నారు.. కానీ ఆయన హామీని ఎవరూ నమ్మరని ఆరోపించారు.
రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఆడపిల్ల పుడితే డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ అమలు కాలేదు.. మేనిఫెస్టోలో జగన్ పెడితే అమలు చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు అడగకనే 12వ వేతన సంఘాన్ని కూడా వేశారని తెలిపారు. డి ఏ. లు పెండింగ్ లేకుండా చేస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం రూ.25 వేల కోట రూపాయల బకాయిలు ఉన్నాయని తప్పుడు సమాచారం చెబుతున్నారని అన్నారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాల కు జగన్ పెంచారు.. సి.పి.ఎస్. వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందని భావించి జిపిఎస్ ను తీసుకువచ్చారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కాస్ సంస్థను ఏర్పాటు చేశారు.. ఇప్పుడు ఒకటి తేదీన జీతాలు, పెన్షన్లు వస్తున్నాయని చంద్రశేఖర్ తెలిపారు.