టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ చీపురుపల్లి, విజయనగరంలో పర్యటనలో మాట్లాడే తీరు చూశానని.. పేపర్లు ఇటుతిప్పి అటుతిప్పి మాట్లాడారని ఎద్దేవా చేశారు. అసలు భౌగోళిక పరిస్థితులపై అసలు అవగాహన ఉందా అని విమర్శించారు. బాలకృష్ణ విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్ కి రండి అని మంత్రి బొత్స సవాల్ విసిరారు. కళ్లులేని కబోదికి ఏం తెలుస్తుంది ఆ విధంగా ఉంది ప్రసంగమని అన్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్ పరీక్షలకు తరఫీదు ఇస్తున్నాం.. మండలానికి పది ప్లస్ అప్ గ్రేడ్ చేశాం.. ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇప్పించి.. డిజిటల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని తెలిపారు. ఎనిమిది తొమ్మిది తరగతులకు బైజూస్ ఇచ్చిన పాఠ్యాంశాలు ఇస్తున్నామన్నారు.
Thotapalli Madhu: దెబ్బకు దిగివచ్చిన నటుడు.. క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్
దేశంలో మరెక్కడా లేని విధంగా విద్యను అందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మూడో తరగతి నుంచి పన్నెండు సంవత్సరాలు ఐబీ కొలాబ్రేషన్ తో ఎలిజబుల్ సర్టిఫికెట్ లు ఇస్తున్నామన్నారు. వెయ్యి హైస్కూల్ సీబీఎస్ కనవర్ట్ చేసి… ఏపీలో జోన్ ఆఫీస్ ఏర్పాటు చేసి మానటరింగ్ చేస్తున్నామని చెప్పారు. సినిమాలలో గెంతుకున్న మీకు పేదవారి పరిస్థితి ఏం తెలుసని విమర్శించారు. మీ నాన్న, మీ బావా ఇద్దరూ ఏనాడైనా ఇలా చేశారా అని ప్రశ్నిచారు. రాబోయే ఏ కాంపిటేటివ్ పరీక్షలు వచ్చిన యాభై శాతం ఏపీ విద్యార్థులు ఉంటారని పేర్కొన్నారు. గతంలో డిగ్రీ పూర్తి చేస్తే.. తరువాత ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులు ఉండేవన్నారు. విదేశీ విద్య కోసం అయిదో పదో లక్షలు ఇచ్చి పంపేవారని తెలిపారు. మెయింటనెన్స్ కోసం మళ్లీ అక్కడ ఏదో రెస్టారెంట్ లో పని చేసి బతుకీడ్చేవారని పేర్కొన్నారు.
Cartier: లక్షల విలువైన బంగారు ఆభరణాలను కేవలం రూ. 2 వేలకే కొన్న కస్టమర్.. మ్యాటరేంటంటే..
కానీ.. కోటి ఇరవై లక్షలు ప్రతి విద్యార్థిపై తమ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి చెప్పారు. ఎడెక్ష సంస్థతో హైయర్ ఎడ్యుకేషన్ ఒప్పందం కుదుర్చుకొని పన్నెండు వందల కోర్సులను అందిస్తున్నామన్నారు. చంద్రబాబుకు ఇలాంటి ఆలోచనలు రావు… వాడి మీదా వీడి మీదా ఆడిపోసుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం.. దీంతో చాలా సీట్లు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తండ్రి పేరు చెప్పుకు బ్రతికేవాడివి నువ్వు అని ఆరోపించారు. ప్రధాన మంత్రి మానిటరింగ్ కమిటీ, నీతీ ఆయోగ్ అందరూ ఈ విద్యా విధానాన్ని మెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ జిల్లాకి ఏ ప్రాజెక్టు అయినా తాము తీసుకొచ్చామని అన్నారు. టీడీపీ ఎన్నిక కమీషన్కు పెట్టిన పిటిషన్ వలన పింఛన్దారుల ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు.