ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. 17.5 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేధించింది. పంజాబ్ బ్యాటింగ్లో బెయిర్ స్టో (46), రిలీ రోస్సో (43) పరుగులతో రాణించారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ (13), శశాంక్ సింగ్ (25*), సామ్ కరన్ (26*)
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైటింగ్ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62) పరుగులతో రాణించడంతో సీఎస్కే.. ఓ మోస్తరు స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 163 పరుగుల ఫైటింగ్ టార్గెట్ను ఉంచింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును ప్రకటించారు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. కాగా.. తుది జట్టులో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. దాంతో పాటు.. స్టార్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లను రిజర్వ్‌లుగా చేర్చారు. అంతర్జాతీయ టీ20ల్లో రింకూ సింగ్ అద్భుతమైన రికార్డు సొంతం చేసుకున్న ఫినిషర్ కి ప్లేయింగ్ 15 టీమ్‌లో చోటు దక్కకపోవడంపై... క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు.
బుధవారం ఐసీసీ బ్యాట్స్‌మెన్ టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. అందులో టీమిండియా స్టార్ ప్లేయర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కాగా.. ఇంతకుముందు నెంబర్ వన్ స్థానంలో ఉన్న పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. టాప్-10లో టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు చోటు దక్కించుకున్నారు. మరొక బ్యాటర్ యశస్వీ జైస్వాల్.. అతను ఆరో స్థానంలో ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. అయితే.. టీమిండియా జట్టులో ఫినిషర్ రింకూ సింగ్ పేరు లేకపోవడంతో.. క్రికెట్ అభిమానులతో పాటు, పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. మరోవైపు.. అతని తల్లిదండ్రులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కేవలం రింకూ సింగ్ పేరు ట్రావెల్ రిజర్వుగా మాత్రమే ఉంది. మరోవైపు.. టీమిండియాకు ఫినిషర్ లేకుండానే మెగా టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
సముద్రంలో బలాన్ని పెంచుకునేందుకు భారత నావికాదళం సూపర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో (స్మార్ట్) వ్యవస్థ కోసం భారత్ విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించింది. బుధవారం ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి 'SMART' వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. SMART అనేది తరువాతి తరం క్షిపణి-ఆధారిత తేలికపాటి టార్పెడో డెలివరీ సిస్టమ్.. ఇది తేలికపాటి టార్పెడోల యొక్క సాంప్రదాయ శ్రేణికి మించి భారత నావికాదళం యొక్క యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి DRDO చే రూపొందించబడింది.
అమెరికా-వెస్టిండీస్ లో జూన్ 2న టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కాగా.. ఈ మెగా టోర్నీలో సెమీ ఫైనల్ కు వెళ్లే నాలుగు జట్ల గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ జోస్యం చెప్పాడు. అయితే.. ఆ జట్లలో టీమిండియాకు స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం. సోషల్ మీడియా వేదికగా అతడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కసారి ఛాన్స్ అడిగితే ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం ఛాన్స్ తీసుకోండని అన్నారు. వైసీపీని ఓడించి అప్పుడు తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలని తెలిపారు. లే అవుట్లు వేయాలన్నా.. ఇళ్ళు కట్టాలన్నా వైసీపీ వాళ్లకు లంచాలు ఇవ్వాలని చెప్పారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాల బాబు అని విమర్శించారు. సింహాచలం భూమి ఆక్రమించి ఎమ్మెల్యే భారీ భవంతి కడితే అడిగే దిక్కు…
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కార్లను భారతీయ కస్టమర్లు చాలా ఇష్టపడుతున్నారు. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. గత నెలలో టయోటా ఎన్ని యూనిట్లను విక్రయించింది? దీంతో పాటు.. కంపెనీ సంవత్సరం ప్రాతిపదికన ఎలా పనిచేసిందనేది తెలుసుకుందాం.