టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. తన బర్త్ డేను ఆర్సీబీ ప్లేయర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో విరాట్, అనుష్కతో పాటు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ దంపతులు హాజరై సందడి చేశారు. కాగా.. ఈ నెల 1న అనుష్క పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క ఫొటోకు పోజులివ్వడం ఇదే తొలిసారి. ఈ ఫొటోను సోషల్ మీడియా వేదికగా విరాట్, అనుష్కతో పాటు డుప్లెసిస్ కూడా నెట్టింట షేర్ చేశారు.
CSK: సీఎస్కే సూపర్ ఫ్యాన్కు ధోనీ స్పెషల్ గిఫ్ట్..!
మరోవైపు విరాట్ కోహ్లీ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. “నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నా జీవితానికి నువ్వు ఓ వెలుగువి. హ్యాపీ బర్త్డే” అంటూ స్పెషల్ విషెస్ తెలిపాడు. అనుష్కతో గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసి ఎమోషనలయ్యాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో విరాట్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. దాదాపు ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ కోహ్లీ రాణించాడు. అయినప్పటికీ, తమ జట్టు విజయాలన అందుకోలేకపోయింది. పాయిట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది.. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మే 4వ తేదీన ఈ మ్యాచ్ జరుగనుంది.
T20 World Cup 2024: న్యూయార్క్‌లో విపరీతంగా పెరిగిన హోటల్ ధరలు.. కారణమేంటంటే..?